Ashok Gajapati Raju: అశోక్ గజపతి రాజు అంటే ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. విజయవాడలోని పూసపాటి వంశీయుల్లో రాజవంశీకుడైన అశోక్ గజపతిరాజును ఇప్పుడు వైసీపీ విడిచిపెట్టట్లేదు. గతంలో ఈయన మీద వైసీపీ చేసిన ఆపరేషన్ సక్సెస్ కాలేదు. అందుకే ఇప్పుడు మరోసారి ఆయన్ను టార్గెట్ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఆయన్ను మాన్సాస్ చైర్మన్ గిరి నుంచి తప్పించినా.. ఆయన కోర్టుకు వెళ్లి పంతం నెగ్గించుకున్నారు.
మళ్లీ ఆయన్నే నియమించింది కోర్టు. అంతే కాదు రామతీర్థం ఆలయ ఛైర్మన్ గానూ ఆయన్నే ఉంచింది. దీంతో కొద్ది నెలలుగా ఈ విషయం మీద ఫోకస్ పెట్టని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి గురిపెట్టింది. ప్రస్తుతానికి అశోక్ గజపతిరాజు తన పనుల మీద తాను బిజీగా ఉంటున్నారు. కానీ చడీ చప్పుడు లేని సునామీలా రామతీర్ధం గుడిని పునర్నిర్మాణంతో హడావిడీని మొదలు పెట్టేసింది. ఇప్పటి వరకు గజపతి రాజు మీద చేసిన ప్రయోగాలు అన్నీ విఫలం కావడంతో ఇప్పుడు ఈ పనిని ముందు వేసుకుంది.
ఈ ఆలయంలో గతంలో రాముని విగ్రహం తలను ధ్వంసం చేసిన ఘటన పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇక దోషుల్ని పట్టుకోవడంలో ప్రభుత్వం కూడా విఫలం అయింది. కాబట్టి ఆ మచ్చను తొలగించుకునేందుకు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణంతో కొత్త పనులు మొదలు పెట్టింది. ఇక అటు గజపతి రాజు అన్న కూతురు సంచైత కూడా కోర్టుకు వెళ్లింది. తనను నియమించాలంటూ పిటిషన్ వేసేసింది.
Also Read: MP Avinash Reddy: సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోబోతుందా.. అసలేం జరుగుతుంది!
అయితే న్యాయస్థానంలో ఆయన్ను ఎదుర్కోలేకపోతున్న ప్రభుత్వం.. ఆయన ఇగో మీద దెబ్బ కొట్టాలని భావిస్తోందంట. ఇందులో భాగంగానే.. ప్రస్తుతం రామతీర్థం ఆలయ చైర్మన్ గా ఉన్న గజపతి రాజు ప్రమేయం లేకుండానే ప్రభుత్వం ఆలయాన్ని నిర్మించేందుకు రెడీ అవుతోంది. ఇక గజపతి రాజు పేరును శిలాఫలకం మీద కూడా రాయలేదు. ముగ్గురు మంత్రుల పేరును మాత్రమే ఇందులో రాసేసి.. నిర్మాణ బాధ్యతలు మొత్తం వారికే అప్పగించారు జగన్. ఈ రకంగా గజపతి రాజును ఇరకాటంలో పడేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
Also Read: AP Govt: ఏపీలో సర్కారు ఆశయం సన్నగిళ్లుతోందా? .. హెల్త్ హబ్స్ నిర్మాణాలకు ముందుకు రాని టెండర్లు?