‘పది’ పరీక్షలపై జగన్ వెనకడుగు వేయాల్సిందేనా!

పదవ తరగతి విద్యార్థులకు కామన్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి ఈ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో రోజుకు 300లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకూ 5,280 మందికి వైరస్ సోకింది. మొత్తం 88 మంది మ రణించారు. కొన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి […]

Written By: Neelambaram, Updated On : June 17, 2020 10:24 am
Follow us on

పదవ తరగతి విద్యార్థులకు కామన్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి ఈ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో రోజుకు 300లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకూ 5,280 మందికి వైరస్ సోకింది. మొత్తం 88 మంది మ
రణించారు.

కొన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణా, తమిళనాడు, ఒడిషా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు ఇందుకు ఉదాహరణ. తెలంగాణా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవగా, కొందరు హైకోర్టు ఆశ్రయించారు. దీంతో ఆ రాష్ట్ర హైకోర్టు పరీక్షల నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో విద్యార్థులు రాసిన పరీక్షల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించి తీరతామని విద్యాశాఖ మంత్రి అదుములపు సురేష్ ఇటీవల స్పష్టం చేశారు.

గతంలో ఒక్కో సబ్జెక్ట్ కు రెండు పేపర్లు ఉండేవి, ప్రస్తుతం వాటిని ఒక పేపర్ కు తగ్గించారు. పరీక్షా పేపర్ లోని ప్రశ్నల సంఖ్య తగ్గించి పరీక్షా సమయం కుదించారు. పరీక్ష కేంద్రాల్లో సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ లను అందుబాటులో ఉంచడం వంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేయడమే మేలనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యేందుకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

శాసన సభ బడ్జెట్ సమావేశాలను కరోనా నేపథ్యంలో రెండు రోజులకు కుదించిన ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు ఎలా నిర్వహించాలని భావిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన, టీడీపీ, బిజెపి, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ను విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల విషయంలో తన నిర్ణయం మార్చుకోక తప్పేలా కనిపించడం లేదు.