https://oktelugu.com/

Jagan Govt: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి కేంద్రంగా నయా పాలిటిక్స్!

Jagan Govt: దేశంలో ఎక్కడా చూడని పాలిటిక్స్ ఏపీలో కనిపిస్తున్నాయి. ఒక సమస్యకు పరిష్కారం చూపకుండానే కొత్త సమస్యను తెరమీదకు తెస్తోంది జగన్ ప్రభుత్వం. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన సీఎం జగన్.. మరోసారి సమగ్రమైన బిల్లును తీసుకొస్తానని ప్రకటించారు. దీంతో అటు ఉత్తరాంధ్రులు, ఇటు రాయలసీమ ప్రాంత ప్రజలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరాదని, మళ్లీ తమకు అన్యాయం చేయొద్దని స్పష్టంచేశారు. తమకు […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 5, 2022 / 04:00 PM IST
    Follow us on

    Jagan Govt: దేశంలో ఎక్కడా చూడని పాలిటిక్స్ ఏపీలో కనిపిస్తున్నాయి. ఒక సమస్యకు పరిష్కారం చూపకుండానే కొత్త సమస్యను తెరమీదకు తెస్తోంది జగన్ ప్రభుత్వం. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన సీఎం జగన్.. మరోసారి సమగ్రమైన బిల్లును తీసుకొస్తానని ప్రకటించారు. దీంతో అటు ఉత్తరాంధ్రులు, ఇటు రాయలసీమ ప్రాంత ప్రజలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరాదని, మళ్లీ తమకు అన్యాయం చేయొద్దని స్పష్టంచేశారు. తమకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మరోవైపు ఉద్యోగులు పీఆర్సీ గురించి ఉద్యమానికి సై అంటున్నారు.

    AP CM Jagan

    ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతం అమరావతితో మరోసారి పొలిటికల్ గేమ్ ప్రారంభించింది. రాజధానిలోని కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. ఏకంగా 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ చట్టంలో 29 రెవెన్యూ గ్రామాలను రాజధాని ప్రాంతంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో పేర్కొన్నారు. ప్రస్తుతం 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మిగతా 10 గ్రామాలను మరో కార్పొరేషన్‌లో కలుపుతామని చెప్పారు. గతేడాది మార్చిలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపాల్టీలతో పాటు మరో 21 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌ ఏర్పాటుచేశారు. ఇందులోనే మిగిలిన గ్రామాలను కలుపుతామని చెబుతున్నారు.

    Also Read: బీసీలకు మరో వరం.. జగన్ వ్యూహం అదేనా?

    అయితే, గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ గతంలో పలువురు హైకోర్టును ఆశ్రయించగా మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 5లక్షల జనాభా ఉన్న ప్రాంతాన్ని మునిసిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తారు. ఒకవేళ 10 లక్షలు దాటితే దానిని మహా నగర పాలకసంస్థగా అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లిలో 2 లేదా3 లక్షలకు మించి జనాభా ఉండరు.

    రాజధాని పరిధిలోని 19 గ్రామాల్లోనూ లక్షకు మించి జనాభా లేరు. అయినా, కార్పొరేషన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఆర్డీఏ ఒక్కటే కానీ, కార్పొరేషన్లు మాత్రం రెండుగా చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్ మార్చొద్దని హైకోర్టు పదే పదే చెబుతున్నా ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు చర్యలకు పాల్పడుతోంది. దీనిపై రైతులు, న్యాయనిపుణులు ఫైర్ అవుతున్నారు.

    Also Read: జగన్ మోడీకి సమర్పించిన వినతిపత్రం ఎలా ఉంది?

    Tags