Smart phone: మీ పాత ఫోన్లను ఇతరులకు అమ్మేస్తున్నారా.. అమ్మే ముందు ఈ పని తప్పనిసరి!

Smart phone: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో మనకు స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అయితే ప్రతిరోజు మార్కెట్లోకి కొత్త వెర్షన్ మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది వాటిని కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో వారి పాత ఫోన్లను తక్కువ ధరకు ఇతరులకు అమ్ముతుంటారు. అయితే ఇలా పాత ఫోన్ లు అమ్మే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. మనం ఎవరికైనా […]

Written By: Navya, Updated On : January 5, 2022 3:24 pm
Follow us on

Smart phone: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో మనకు స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అయితే ప్రతిరోజు మార్కెట్లోకి కొత్త వెర్షన్ మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది వాటిని కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో వారి పాత ఫోన్లను తక్కువ ధరకు ఇతరులకు అమ్ముతుంటారు. అయితే ఇలా పాత ఫోన్ లు అమ్మే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది.

మనం ఎవరికైనా మన పాత ఫోన్ అమ్మేటప్పుడు ముందుగా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం తప్పనిసరి అని మొబైల్ నిపుణులు సూచిస్తుంటారు. ఇలా చేయటం వల్ల మొబైల్ డేటా మొత్తం డిలీట్ అవుతుంది. అలా కాకుండా రీసెట్ చేయకుండా ఉంటే మన డేటా మన వివరాలన్నీ ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో సైబర్ మోసాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి కనుక మొత్తం మన మొబైల్ ఫోన్ రీసెట్ చేయాలి.అయితే చాలామందికి ఫోన్ ఎలా రీసెట్ చేయాలి అనే విషయం తెలియకపోవచ్చు అయితే ఫోన్ రీసెట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

ముందుగా మీరు మీ ఫోన్లో ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో వాటి నుంచి లాగౌట్ కావాలి. దీనికోసం ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి లాగ్ అవుట్ ఆప్షన్ నొక్కాలి. ఆ తర్వాత గూగుల్ అకౌంట్ నుంచి లాగ్ అవుట్ కావడం వల్ల మన వివరాలు సింక్ కాకుండా ఉంటాయి. ఆ తర్వాత మన సెల్ ఫోన్ లో ఉన్న సిమ్ కార్డ్ ఎస్ డి కార్డు తొలగించాలి. ఆ తరువాత సెట్టింగ్‌లోకి వెళ్లి జనరల్‌ మేనేజ్‌మబెంట్‌పై క్లిక్‌ చేస్తే అందులో రీసెట్‌ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ అవుతుంది అలాగే మన మొబైల్ ఫోన్ లో ఎలాంటి సమాచారం ఉండదు.