AP Govt: రియల్ ఎస్టేట్ వ్యాపారం పై జగనన్న హోసింగ్ పేరిట మరో బాదుడు!

AP Govt: ప్రభుత్వం పాలించాలి. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఏమవుతుంది.. ఇదిగో ఇలానే అభాసుపాలవుతోంది. ప్రజలకు సంక్షేమం అందించాల్సిన ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి వారికి కేటాయించిన ఇళ్లలోంచి కమీషన్ వసూలు చేస్తే ఏమవుతుంది? ఇదిగో జగన్ సర్కార్ కూడా అదే చేస్తోంది. విమర్శలు కొనితెచ్చుకుంటోంది. జగనన్న హౌసింగ్ పేరిట బాదుడు మొదలుపెట్టిన ఏపీ ప్రభుత్వంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.ఇదెక్కడి న్యాయం అని విమర్శిస్తున్నారు. మరో వైపు వైసీపీ ప్రభుత్వం మాత్రం అప్పుల కుప్పల్లో […]

Written By: Neelambaram, Updated On : December 7, 2021 3:15 pm
Follow us on

AP Govt: ప్రభుత్వం పాలించాలి. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఏమవుతుంది.. ఇదిగో ఇలానే అభాసుపాలవుతోంది. ప్రజలకు సంక్షేమం అందించాల్సిన ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి వారికి కేటాయించిన ఇళ్లలోంచి కమీషన్ వసూలు చేస్తే ఏమవుతుంది? ఇదిగో జగన్ సర్కార్ కూడా అదే చేస్తోంది. విమర్శలు కొనితెచ్చుకుంటోంది. జగనన్న హౌసింగ్ పేరిట బాదుడు మొదలుపెట్టిన ఏపీ ప్రభుత్వంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.ఇదెక్కడి న్యాయం అని విమర్శిస్తున్నారు. మరో వైపు వైసీపీ ప్రభుత్వం మాత్రం అప్పుల కుప్పల్లో ఆర్థికంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక స్థిరత్వం వస్తుందని జగన్ సర్కారు ఆశిస్తోంది. అయితే, ఈ డెసిషన్ ఇంపాక్ట్ స్థిరాస్థి వ్యాపారులపైన పడనుంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై ఫోకస్..

AP Govt

స్థిరాస్థి వ్యాపారులు కొత్తగా వేసే ప్రైవేటు లేఅవుట్స్‌లో 5 % స్థలాన్ని ఇక నుంచి వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలి. ఒక వేళ స్థలం కేటాయించనట్లయితే స్థలం ప్రైమరీ వ్యాల్యూపై స్థలానికి అయ్యేంత డబ్బు అయినా చెల్లించాలి. ఈ మేరకు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది. ఇందుకు జగన్ సర్కారు 2017 లేఅవుట్, సబ్-డివిజన్ రూల్స్‌ను సవరించింది.

Also Read: ఏపీ కలల పోల‘వరం’.. ఇంకెంతో దూరం?

ప్రజెంట్ ప్రతీ లేఅవుట్‌లో 10 % ప్లేస్ సామాజిక అవసరాల కోసం వ్యాపారులు కేటాయిస్తున్నారు. దానికి మరో 5% అదనంగా కేటాయించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 15 % కేటాయిచాల్సి ఉంటుంది. ఇక ఈ ప్లేస్‌ను వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టు కోసం యూజ్ చేయనున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో స్థిరాస్థి వ్యాపారులు వేయబోయే లేఅవుట్స్‌కు ఈ నిర్ణయం వర్తించనుంది.

లేఅవుట్‌లో 5% ప్లేస్ కేటాయించడం సాధ్యం కాని పక్షంలో అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలోపు అంతే విస్తీర్ణంలోని ప్లేస్‌నూ ఇవ్వొచ్చని పురపాలక శాఖ వివరించింది. ఒక వేళ స్థలం ఇవ్వడం ఇష్టం లేకపోతే బేసిక్ వ్యాల్యూలో 5 % ప్లేస్‌కు మనీ కూడా పే చేయొచ్చు. స్థలం లేదా డబ్బు ఏదైనా కాని స్థానిక జిల్లా కలెక్టర్స్‌కు అప్పగించాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం అనుకున్న హౌసింగ్ లక్ష్యం నెరవేరడంతో పాటు ఆర్థికంగా ఆదాయం సమకూరే చాన్సెస్ ఉంటాయని భావిస్తున్నారు అధికారులు. అయితే, ఈ నిర్ణయం పట్ల స్థిరాస్తి వ్యాపారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..

Also Read: సీఎం జగన్‌ను హెచ్చరిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ..!

Tags