https://oktelugu.com/

Pekamedalu Movie Review: ‘పేక మేడలు’ ఫుల్ మూవీ రివ్యూ…

చిన్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సంపాదించుకోవడమే కాకుండా తమదైన రీతిలో సక్సెస్ లను కూడా అందుకుంటున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే చిన్న సినిమాగా వచ్చిన 'పేక మేడలు' మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Written By:
  • Gopi
  • , Updated On : July 19, 2024 / 03:00 PM IST

    Pekamedalu Movie Review

    Follow us on

    Pekamedalu Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కొత్త దర్శకులు వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సంపాదించుకోవడమే కాకుండా తమదైన రీతిలో సక్సెస్ లను కూడా అందుకుంటున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే చిన్న సినిమాగా వచ్చిన ‘పేక మేడలు’ మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే లక్ష్మణ్ (వినోద్ కిషన్) అనే వ్యక్తి బిటెక్ కంప్లీట్ చేసినప్పటికీ ఏ పని చేయకుండా ఖాళీ గా ఉంటాడు. అలాగే కష్టపడకుండా కోటీశ్వరుడు అవ్వడం ఎలా అనే దాని గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తన భార్య అయిన వరలక్ష్మి (అనుష కృష్ణ) సంపాదించే డబ్బుతోనే బతుకుతూ అదే డబ్బుతో అన్ లైన్ లో పేకాట ఆడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమం లోనే భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇదే సమయం లో లక్ష్మణ్ జీవితంలోకి శ్వేత (రేతిక శ్రీనివాస్) అనే ఎన్నారై అమ్మాయి వస్తుంది. ఇక శ్వేత ను ఎలాగైనా సరే ట్రాప్ చేయాలని లక్ష్మణ్ చూస్తుంటాడు.

    ఈ క్రమం లో ఈ విషయం లక్ష్మణ్ భార్య అయిన వరలక్ష్మికి తెలిసి ఆమె అతన్ని వదిలేసి వెళ్తుంది. అసలు లక్ష్మణ్ ఎందుకు అలా సోమరిగా మారాడు. శ్వేత విషయం లో లక్ష్మణ్ ఏం చేశాడు తను అనుకున్నట్టుగానే కోటీశ్వరుడు అయ్యాడా? లేదా తన భార్య మళ్ళీ తన దగ్గరికి వచ్చిందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమాను చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు డబ్బు విషయం లో ఎలా సఫర్ అవుతారు అనే పాయింట్ ను బేస్ చేసుకొని ఈ సినిమాను తీశారు. అలాగే ఇంట్లో మగాడు పని చేయకపోతే ఆ ఇంటి మహిళా ఎలా తన కుటుంబాన్ని పోషిస్తుంది. ఎవ్వరి తోడు లేకపోయిన ఒక మహిళ ఎలా తన రంగం లో ముందుకు వెళ్తుంది అనేది కూడా చాలా చక్కగా చూపించారు. నిజానికి ఇందులో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా బాగా చూపించారు…ఇక డైరెక్టర్ ‘నీలగిరి మామిళ్ళ’ ఒక మంచి కథ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే సినిమాలో కొన్ని ఎగ్జాయ్టింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ దర్శకుడు వాటి గురించి డిస్కస్ చేయకుండా తను అనుకున్న కథను మాత్రమే చెప్పుకుంటూ పోయాడు. ఇక కొన్ని సీన్లు అయితే డైలీ నిజ జీవితం లో మన ఇంట్లో జరిగే విషయాలను సీన్లు గా రాసి చూపించాడు.

    అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఏం పని చెయ్యని లక్ష్మణ్ వైఖరి చూస్తే చాలా సార్లు మనకు లక్ష్మి విషయం లో భాదేస్తుంది. ఇక దర్శకుడు వాళ్ల క్యారెక్టర్స్ ను మాత్రం చాలా బాగా డిజైన్ చేశాడు. ఇక మొత్తానికైతే ఒక మిడిల్ క్లాస్ మూడ్ ను క్రియేట్ చేయడం లో డైరెక్టర్ సక్సెస్ అయినప్పటికీ ఇంకా కొంచెం బెటర్ గా చూపించవచ్చు అనే విధంగా ఈ కథలో స్పేస్ అయితే ఉంది…కానీ దర్శకుడు ఆ స్పేస్ ని మాత్రం ఎక్కువగా వాడుకోలేదు. అలాగే ఈ సినిమాలో ఆయన చూపించిన ప్రతి క్యారెక్టర్ కూడా మన నిజ జీవితంలో ఎక్కడోక్కడ తారస పడుతూనే ఉంటారు. ఒక రియలెస్టిక్ క్యారెక్టర్లను డిజైన్ చేసుకున్న విధానం అయితే చాలా బాగుంది.

    అయినప్పటికీ సినిమా మొత్తం చూశాక లక్ష్మణ్ క్యారెక్టర్ లో ఇంకాస్త నిజాయితి ని చూపించి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఇక మొత్తానికైతే దర్శకుడు నీలగిరి తను అనుకున్న కథను మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఈ విషయంలో మాత్రమే మనం ఆయన్ని మెచ్చుకోవచ్చు ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ వాటిని పక్కన పెడితే దర్శకుడు ఈ సినిమాని జన్యూన్ అటెంప్ట్ గా తీర్చిదిద్దడమే కాకుండా ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడం లో చాలా బాగా కృషి చేశాడు…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన వినోద్ కిషన్, అనుష కృష్ణ చాలా అద్భుతంగా చేశారు. ప్రతి సీన్ లో కూడా మ్మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఉన్న మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందో అలాంటి మెంటలాటి తోనే వాళ్ళ క్యారెక్టలను డిజైన్ చేసి రాసుకున్న విధానం బావుంది. వాళ్ళు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. నిజానికి వీళ్లిద్దరూ ఈ సినిమాకి పిల్లర్స్ గా నిలిచి సినిమాని విజయ తీరాలకు చేర్చడంలో చాలావరకు కృషి చేశారు… భార్య భర్తల ఇద్దరి మద్య వచ్చే గొడవ సీన్ లో కూడా వీళ్ళు చాలా బాగా చేశారు.

    ఇక నిజమైన భార్య భర్తలు ఎలా అయితే గొడవలు పెట్టుకుంటారో అలాంటి ఒక జన్యూన్ ఫీల్ ను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక వీళ్ల తర్వాత రేతిక శ్రీనివాస్ చేసిన పాత్ర గురించి చెప్పాలి. ఈమె కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఆమె పోషించిన పాత్ర ఎంతవరకైతే ఉందో ఆ మేరకు నటించి మెప్పించింది… ఇక ఈ సినిమాలో ఉన్న మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

    టెక్నికల్ అంశాలు

    ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే స్మరన్ సాయి మ్యూజిక్ సినిమాలో ఉన్న ఫీల్ ని పెంచడం లో చాలా వరకు హెల్ప్ అయ్యింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే ఎమోషనల్ సీన్ల ల్లో చాలా బాగా వర్కవుట్ అయింది. ఇక ఈ సినిమాలో విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు నాచురల్ ఫీల్ అయితే వచ్చింది…ఇక ఎడిటర్ అయిన సృజన అడుసుమిల్లి కూడా చాలా వరకు షార్ప్ ఎడిట్ చేసి సినిమా లో ఉన్న సోల్ డిస్ట్రబ్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ చేసింది…

    ప్లస్ పాయింట్స్

    కథ
    ఆర్టిస్టుల పర్ఫామెన్స్
    ఎమోషనల్ సీన్స్
    బ్యాగ్రౌండ్ స్కోర్

    మైనస్ పాయింట్స్

    కొన్ని సీన్లు రోటీన్ గా అనిపించాయి…
    మొదట్లో కొంచెం బోరింగ్ సీన్స్ ఉన్నాయి…

    రేటింగ్
    ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్
    మిడిల్ క్లాస్ లైఫ్ ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం లో చాలా వరకు సక్సెస్ అయ్యారు…