Pawan Kalyan Rana: భీమ్లానాయక్ విషయంలో మొదటి నుంచి ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి. అయ్యప్పనుమ్ కోశియమ్‌కు రీమేక్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీలో ఇద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంది. కానీ తెలుగుకు వచ్చే సరికి మాత్రం పవన్ పాత్ర పేరు భీమ్లానాయక్‌ను టైటిల్ గా పెట్టడంతో ఇది కేవలం పవన్ సినిమా అని చాలామంది కితాబు ఇచ్చేశారు.

అంతే కాకుండా రానాను ఇందులో విలన్‌ను చేశారనే రూమర్లు బాగా వచ్చాయి. దీంతో ఇద్దరి హీరోల నడుమ కొంత వార్ మొదలయింది. అయితే శుక్రవారం సినిమా వచ్చిన తర్వాత అవన్నీ పటపంచలు అయిపోయాయని తెలుస్తోంది. ఎందుకంటే రానా తన నటనతో కొన్ని సన్నివేశాల్లో పవన్‌ను డామినేట్ చేశారని అంటున్నారు కొందరు ప్రేక్షకులు.
వాస్తవానికి మళయాలంలో రానా పాత్ర నుంచే సినిమాను చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం పవన్ పాత్ర నుంచే సినిమాను చెప్పాలని చూశామని అందుకే పవన్ కోసం స్క్రీన్ ప్లేను ఎక్కువ రాసుకున్నట్టు త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. కానీ సినిమాలో కొన్ని చోట్ల డేనియల్ శేఖర్ గా రానా అద్భుతంగా నటించి తన పాత్ర ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించాడు.
Also Read: భీమ్లానాయక్ టీమ్‌కు అదిరిపోయే పార్టీ.. ఇచ్చింది ఎవరనుకున్నారు..?
ఇందులో పవన్ కూడా ఏం తక్కువ కాలేదు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్, అలాగే పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మాజీ సోల్జర్ గా రానా తమ పాత్రలను పండించారు. ఇందులో రానా పోలీస్ స్టేషన్ సీన్ లో పవన్‌ను డామినేట్ చేశారని చాలామంది అంటున్నారు. ఇక రానా భార్య వచ్చిన సమయంలో కూడా ఇలాగే జరిగిందంటున్నారు.
రానా స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం అంటూ చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు. దీంతో ఇద్దరికీ క్రెడిట్ వెళ్లిపోతోంది. పవన్ కూడా కెరీర్‌లోనే చాలామంది పర్ఫార్మెన్స్ అందించారు. కాబట్టి మూవీ అందరూ ఊహించన విధంగా పెద్ద సక్సెస్ అయింది.
Also Read: భీమ్లానాయక్ విషయంలో అలా చెప్పొద్దట.. ఇదేం రచ్చ రా నాయనా..!
[…] Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. గతంలో పవన్‌కి వ్యతిరేకంగా మాట్లాడి, వైఎస్‌ఆర్‌సీపీలో చేరి, ఎస్‌వీబీసీ ఛానెల్‌కి చైర్మన్ కూడా అయిన పృథ్వీరాజ్, ఆతర్వాత వివాదాలతో అన్నిటికీ దూరమయ్యారు. ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఈక్రమంలో భీమ్లా నాయక్ సినిమా చూశాడట. సినిమా సూపర్ అని, పవన్‌కి దిష్టి తగలకూడదని అన్నాడు. అంతేకాదు, ఎన్‌టీఆర్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్‌కే ఉందన్నాడు. […]