అట్టడుగు స్థానంలో ఏపీ..! ఇలా ఉంటే కష్టమే జగన్

జగన్ మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అయిన తర్వాత ఎంతోమంది ఎన్నో రివ్యూలు, విశ్లేషణలు ఇచ్చేశారు. అందరూ చెబుతున్నది ఏమిటంటే…. ఆయన సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన అభివృద్ధి కార్యకలాపాలపై అసలు అతనికి ఈ ఆలోచన కాదు కదా కనీస అవగాహన కూడా లేదని విమర్శలు చేశారు. గడచిన ఏడాది కాలంగా విపక్షాలు కూడా ఇదే విషయాన్ని పదేపదే మొత్తుకుంటున్నాయి. Also Read : ‘రక్తపాత దినోత్సవం […]

Written By: Navya, Updated On : August 29, 2020 9:50 am
Follow us on

జగన్ మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అయిన తర్వాత ఎంతోమంది ఎన్నో రివ్యూలు, విశ్లేషణలు ఇచ్చేశారు. అందరూ చెబుతున్నది ఏమిటంటే…. ఆయన సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన అభివృద్ధి కార్యకలాపాలపై అసలు అతనికి ఈ ఆలోచన కాదు కదా కనీస అవగాహన కూడా లేదని విమర్శలు చేశారు. గడచిన ఏడాది కాలంగా విపక్షాలు కూడా ఇదే విషయాన్ని పదేపదే మొత్తుకుంటున్నాయి.

Also Read : ‘రక్తపాత దినోత్సవం ఎఫెక్ట్’ : సాయి రెడ్డికి రక్త కన్నీరు తెప్పించింది

అంతెందుకు నిజానికి వైఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద పెట్టిన దృష్టి ఓవరాల్ అభివృద్ధి మీద అసలు పెట్టలేదని వైసిపి వర్గాలే ఆఫ్ ది రికార్డ్ గా ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ విషయం ఎందుకు తెరమీదకు వచ్చింది అంటే… తాజాగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్…. తదితర కేటగిరీలలో రాష్ట్రం పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయింది అని నీతి అయోగ్ చెప్పింది. ఇక సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ కి ఆరో ర్యాంకు వస్తే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కి మాత్రం 20వ ర్యాంక్ వరించింది.

అసలు తీరప్రాంతం ఎక్కువగా కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగైన ఎక్స్పోర్ట్ పాలసీలను కలిగి ఉండాలి .తెలంగాణ కంటే ఎంతో ముందంజలో ఉండాలి. కానీ ఈ విషయంలో జగన్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవని…. ఇక ఇదే పరిస్థితి చాలా కాలంగా ఉంటే ఎలా అని నీతి అయోగ్ కడిగిపారేసినట్టు మీడియాలో కథనాలు దర్శనమిచ్చాయి. సాధారణంగా కేంద్రం నుంచి వచ్చే వివిధ ర్యాంకుల విషయమై ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయి ఏమిటో ప్రజలకు చూపించడానికి ఆసక్తి కనబరుస్తాయి. అయితే ఈ సారి మాత్రం ఏపీ అధికార పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేదు.

“మెరుగైన పాలసీలు రూపొందిస్తాం…. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం” అన్న మాటలు కేవలం ప్రచారానికే పరిమితం అయిపోయాయి. ఎక్స్పోర్ట్ పాలసీల సంగతి పక్కన పెడితే…. ఇండస్ట్రీలు, కంపెనీలు, ఐటీ సెక్టార్ ఎదుగుదల ఉద్యోగాల కల్పన లాంటివి ఏమీ లేవు. కేవలం నవరత్నాలు, సంక్షేమ పథకాలు, జగనన్న పథకం, వైయస్సార్ పథకం…. ఈ పథకం…. ఆ పథకం. అంతే…! పబ్లిసిటీ మీద పెట్టిన చిత్తశుద్ధి అభివృద్ధి మీద పెడితే ఫలితాలు బాగుంటాయి అని సర్వత్రా మొదలైపోయింది. ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్, ఇన్ఫ్రా స్ట్రక్చర్, యాక్సెస్ టు ఫైనాన్స్ తదితర విభాగాల్లో రాష్ట్రం పనితీరు అత్యంత అధ్వానంగా ఉందని నీతి అయోగ్ పేర్కొంది. మరి వీటి పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read : సీఎం జగన్, వైసీపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే?