‘రక్తపాత దినోత్సవం ఎఫెక్ట్’ : సాయి రెడ్డికి రక్త కన్నీరు తెప్పించింది

ఈ మధ్యకాలంలో వైసిపి పార్టీ ముఖ్య నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వేస్తున్న ట్వీట్లు అంతా ‘రివర్స్ అటాక్’ కు ప్రత్యర్థులకు ఆస్కారం ఇస్తూ ఉన్నాయి. తను ఏమి మాట్లాడాలనుకున్నా… ముందు ట్వీట్ల రూపంలో చెప్పి ఆ తర్వాత మైకు ముందుకు వచ్చే సాయి రెడ్డి ఇలా ట్వీట్ల ద్వారా పొందే ఆనందం ఏమిటో అతనికే తెలియాలి కానీ మొత్తానికి ఈ మధ్య కాలంలో ఆయన ట్వీట్లు జగన్ మోహన్ […]

Written By: Navya, Updated On : August 29, 2020 1:16 pm
Follow us on

ఈ మధ్యకాలంలో వైసిపి పార్టీ ముఖ్య నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వేస్తున్న ట్వీట్లు అంతా ‘రివర్స్ అటాక్’ కు ప్రత్యర్థులకు ఆస్కారం ఇస్తూ ఉన్నాయి. తను ఏమి మాట్లాడాలనుకున్నా… ముందు ట్వీట్ల రూపంలో చెప్పి ఆ తర్వాత మైకు ముందుకు వచ్చే సాయి రెడ్డి ఇలా ట్వీట్ల ద్వారా పొందే ఆనందం ఏమిటో అతనికే తెలియాలి కానీ మొత్తానికి ఈ మధ్య కాలంలో ఆయన ట్వీట్లు జగన్ మోహన్ రెడ్డిని బాగా ఇబ్బంది పెడుతూ వచ్చాయి.

Also Read : పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఇంత వైలెంటా?

వివరాల్లోకి వెళితే.. తాజాగా ఆయన వేసిన ట్వీట్ లో చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ‘బషీర్ బాగ్ కాల్పుల’ ఘటనను ప్రస్తావిస్తూ దీన్ని ‘చంద్రన్న రక్తపాత దినోత్సవం’ గా గుర్తించాలని విజయసాయిరెడ్డి ట్వీట్ వేశాడు. ఆగస్టు 25వ తేదీన విశ్వాసఘాతకుడు గా 25 ఏళ్ళు పూర్తి చేసుకుని ‘వెన్నుపోటు దినోత్సవం’ జరుపుకున్న బాబు ఆగస్టు 28న ‘రక్తపాత దినోత్సవం’ జరుపుకుంటున్నారు అని విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్ బాగానే పేలింది…. కానీ అందుకు వచ్చిన రెస్పాన్స్ లు రిప్లై లు చూస్తేనే సాయిరెడ్డికి అతను చేసిన తప్పు తెలిసి వస్తుంది.

వాళ్ల తెలుగు తమ్ముళ్ళో లేదా ఇతర పార్టీ వారో తెలియదు కానీ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ‘ముదిగొండ కాల్పుల’ ఘటనను ప్రస్తావిస్తూ దానిని ‘వైఎస్ఆర్ రక్తపాత దినోత్సవం’ గా జరుపుకోవాలా అని చాలామంది ప్రశ్నించారు. ఇదంతా ఎందుకు…. తాజాగా అమరావతిలో గడిచిన గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని అణిచివేసేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపుతోంది.

తుపాకీ అయితే ఇంకా పేలలేదు గానీ లాఠీలు మాత్రం రోజూ విరుగుతున్నాయని…. మహిళలని కూడా చూడకుండా పోలీసులు చేసిన ఓవరాక్షన్ పై కోర్తు వారు వేసిన మొట్టికాయలను గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో హైకోర్టు దెబ్బకు వైసీపీ పరిస్థితి ఏమంత బాగాలేదు. ఇలాంటి సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్న అతను ‘రక్తపాత దినోత్సవం’ లాంటి మాటలు మాట్లాడితే ఎలా? తిరిగి అవి రివర్స్ లో మనకే తగులుతాయి అని ఆ మాత్రం తెలియదా అని సొంత పార్టీ వర్గాలే గొణుక్కుంటున్నాయట. మరి విజయసాయిరెడ్డి జాగ్రత్తపడతారా లేదా ఎప్పటిలాగే ఏదైనా నా ట్వీట్లు మాత్రం ఆపేది లేదని మొండికేసి కూర్చుంటారా…? చూద్దాం…!

Also Read : పేకాట శిబిరం వెనుక మంత్రి?