PRC Fight: పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. కొద్ది రోజులుగా పీఆర్సీ ప్రకటనపై ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. పీఆర్సీపై నాన్చివేత ధోరణి సరికాదని చెబుతున్నా సీఎం జగన్ సానుకూలంగా స్పందించడం లేదు. ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై కొద్ది రోజులుగా వేచి చూస్తున్న తీపి కబురు మాత్రం వారికి చేరడం లేదు. దీంతో ఉద్యోగులు పీఆర్సీ ప్రకటించాలని ఎంత మొత్తుకుంటున్నా వారి ఆశలు మాత్రం తీరడం లేదు.

ఫిట్ మెంట్ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులు కోరుతున్న వారి డిమాండ్లు మాత్రం తీర్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు ఫిట్ మెంట్ అంశంపై చర్చలు జరుపుతున్నా కొలిక్కి రావడం లేదు. దీంతో ఉద్యోగసంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 9లోగా చర్చలు సఫలం కాకుంటే ఆందోళన చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
Also Read: బీసీలకు మరో వరం.. జగన్ వ్యూహం అదేనా?
సీఎం జగన్ తో పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం మాత్రం కానరాలేదు. దీంతో పీఆర్సీ ప్రకటన తాత్సారంపై అటు ఉద్యోగులు ఇటు ప్రభుత్వం పట్టు వీడటం లేదు. ఎక్కువ ఫిట్ మెంట్ కావాలని ఉద్యోగులు చెబుతుండగా ప్రభుత్వం మాత్రం అంత మొత్తం ఇవ్వలేమని చెబుతోంది. దీంతో ఉద్యోగ సంఘాలు ఫిట్ మెంట్ 40 శాతం ఇవ్వాలని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది.
వివిధ బిల్లుల రూపంలో రూ. 1600 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ ప్రకటన త్వరగా ప్రకటించాలని కోరుతున్నా సరైన స్పందన కానరావడం లేదు. కానీ పీఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై సందిగ్దం నెలకొంది.
Also Read: జగన్ మోడీకి సమర్పించిన వినతిపత్రం ఎలా ఉంది?