Sonia Agarwal: ‘7/G బృందావన కాలని’ అంటూ తెలుగు తెరకు ముద్దుల తారగా పరిచయం అయింది సోనియా అగర్వాల్. అందంతో పాటు అభినయంలోనూ సోనియా అగర్వాల్ కి ప్రత్యేక టాలెంట్ ఉంది. పైగా మొదటి సినిమా భారీ విజయం సాధించింది. కానీ, డైరెక్టర్ సెల్వరాఘవన్ ప్రేమలో పడి.. తెలుగులో హీరోయిన్ గా చేయమని భారీ అవకాశాలు వచ్చినా చేయలేదు. వచ్చిన స్టార్ డమ్ ను గాలికి వదిలేసింది.

అమాయకంగా, క్యూట్ క్యూట్ గా కనిపించే ఈ భారీ అందాల భామ మొత్తానికి ఆ తర్వాత ప్రేమకే ఓటు వేసి.. డైరెక్టర్ సెల్వరాఘవన్‌ను 2006లో ప్రేమ వివాహం చేసుకుని కొన్నేళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయింది. అయితే, పెళ్లి అయ్యాక, సెల్వరాఘవన్ తో ఆమె సంతోషంగా లేదట. చాలా సంవత్సరాలు భరించి భరించి విసిగిపోయి చివరకు.. సెల్వరాఘవన్ కి గుడ్ బాయ్ చెప్పింది.
తిరిగి చూసుకుంటే సెల్వరాఘవన్ తో పెళ్లి తప్ప ఆమె జీవితంలో ఆమెకంటూ ఏమి మిగలలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సాలిడ్ గా ఏమి లేదు. అందుకే, ఇక తప్పక లేటు వయసులో కూడా గ్లామర్ గేట్లు ఓపెన్ చేసి.. సినిమాల్లోకి మళ్ళీ దూకేసింది. కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినా.. తెర పై ప్రభావం చూపలేకపోయింది.
Also Read: మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన హీరోలు వీళ్ళే !
అయితే, తనకు ఉన్న సినీ ఇండస్ట్రీ పరిచయాలతో మొత్తానికి అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకుంటూ వస్తోంది. పైగా వయసు పెరుగుతున్నా, రోజురోజుకు తనలోని అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు మతులు పోగొట్టడానికి ఈ మధ్య తెగ ఫోటోషూట్లు కూడా చేస్తోంది. కానీ సినిమా ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. రాకపోయినా.. ఈ ముదురుభామ మాత్రం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.
ఇప్పటికీ తనలో తరగని గ్లామర్ ఉంది అంటుంది. ఇదే విషయాన్ని డైరెక్ట్ గా మేకర్స్ కి మెసేజ్ లు పెడుతూ ఛాన్స్ లు అడుగుతుంది. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనకు ఎవ్వరూ ఆఫర్స్ ఇవ్వకపోవడం దారుణం అంటూ ఎమోషనల్ కూడా అవుతుంది. అసలుకే తానూ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను అంటూ ఆమె బాధపడుతుంది. డబ్బును సంపాధించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఆమెకు అవకాశాలు వస్తాయా ? చూడాలి.
Also Read: బ్రేకప్ గురించి ఓపెన్ అయిన అనుపమ పరమేశ్వరన్… ఎవరితో అంటే ?