జగన్ నిర్ణయాలు సరైనవి కదా..?

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సహేతుకంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభాసుపాలవుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వానికి న్యాయస్థానాలతో చీవాట్లు పెట్టించుకోవటం అలవాటుగా మారిందేమోన్న సందేహం కలుగుతోంది. గడచిన 10 నెలల వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 52 నిర్ణయాలపై న్యాయస్థానాలు తప్పుపడుతూ ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకొనేలా చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏదొరకంగా వాటిని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. పంచాయతీ కార్యాలయాలపై పార్టీ రంగులు తొలగించాలని హైకోర్టు […]

Written By: Neelambaram, Updated On : April 16, 2020 11:10 am
Follow us on


రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సహేతుకంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభాసుపాలవుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వానికి న్యాయస్థానాలతో చీవాట్లు పెట్టించుకోవటం అలవాటుగా మారిందేమోన్న సందేహం కలుగుతోంది. గడచిన 10 నెలల వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 52 నిర్ణయాలపై న్యాయస్థానాలు తప్పుపడుతూ ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకొనేలా చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏదొరకంగా వాటిని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. పంచాయతీ కార్యాలయాలపై పార్టీ రంగులు తొలగించాలని హైకోర్టు తేల్చి చెప్పినా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తీవ్రంగానే స్పందించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పుడు కాషాయ రంగు వేయాలా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం కమిటీ పేరుతో కాలయాపన చేస్తోంది.

తాజాగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై వెనక్కి తగ్గేది లేదని విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్ ప్రకటించారు. హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.

గతంలోనూ అనేకసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును ఇచ్చిన అంశాలను పరిశీలిస్తే…

రాజధాని భూములను మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలనే నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

రాజధాని అమరావతి నుంచి తరలించే విషయంలో కొన్ని శాఖల కార్యలయాలు తరలించేందుకు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపటింది. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర కార్యాలయాన్ని కర్నూలు కు తరలించే విషయంలోను కోర్ట్ మొట్టికాయలు వేసింది. సీఎం కు బాబాయి అయిన వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వైసీపీ అధికారంలోకి రాకముందు ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వ్యతిరేకంగా స్థానికులు చేస్తోన్న ఉద్యమం సందర్భంగా గ్రామాల్లో 144 సెక్షన్ విధించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంతంలో పోలీసుల భారీ కవాతు నిర్వహించడం, మహిళను బూటు కాలితో తన్నడం వంటి అంశాలపై అక్కడి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ చర్యలపైనా హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండర్స్ విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్ట్ ఆక్షేపించింది. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత తగ్గింపుపైనా హైకోర్టు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. న్యాయస్థానాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని తీర్పులు ఇచ్చినా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావడం లేదు.