Tollywood Mother Characters Remuneration: సినిమాల్లో ఈ మధ్య అమ్మ పాత్రలకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. పైగా ఈ పాత్రల్లో ఒకప్పటి లాగా సాధారణ నటులను తీసుకోకుండా.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సీనియర్ హీరోయిన్లను తీసుకుంటున్నారు. దీంతో ఆ పాత్రకు గుర్తింపు రావడంతో పాటు సినిమా హిట్ కావడంలో హీరో, హీరోయిన్లతో పాటు వారు కూడా పాత్ర పోసిస్తున్నారు. ఇలా తల్లి క్యారెక్టర్లు చేస్తున్న వారి రెమ్యునరేషన్ ఇలా ఉంది.
నదియా ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తల్లి పాత్రలకు రోజుకు రెండు నుంచి మూడు లక్షలు తీసుకుంటోందంట. అలాగే సహజనటిగా గుర్తింపు పొందిన జయసుధ కూడా రోజుకు రూ.2లక్షల వరకు తీసుకుంటున్నారంట. ఇక సీనియర్ నటి రేవతి రోజుకు ఇంత అని కాకుండా.. ఒక్కో సినిమాకు తన పాత్ర పరిధిని బట్టి రూ.25లక్షల దాకా తీసుకుంటున్నారు.
ఇక ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి పాత్రల్లో కనిపిస్తున్న నటి తులసి కూడా రోజుకు దాదాపు రూ.60వేల దాకా తీసుకుంటుందంట. ఈమెకు ఎక్కువ తీసుకునే అవకాశం ఉన్నా రెమ్యునరేషన్ ను పెద్దగా పట్టించుకోరని సమాచారం. అలాగే పవిత్ర లోకేష్ రోజుకు రూ.40వేల దాకా తీసుకుంటోంది. అలాగే శరణ్య కూడా రోజుకు రూ.40వేల దాకా అడుగుతున్నారంట.
Also Read: పాడుతా తీయగాకు టఫ్ పోటీ ఇవ్వబోతున్న సరిగమప!
ఇక వీరందరికంటే చాలా ఎక్కువగా తీసుకుంటోది రమ్యకృష్ణ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాను ఏలిన ఈమె.. ఇప్పుడు తల్లి పాత్రల్లో బాగానే మెరుస్తోంది. అది కూడా పెద్ద సినిమాలో మాత్రమే చేస్తోంది. ఈమె రోజుకు రూ.6లక్షల దాకా తీసుకుంటోందంట. అయితే పాత్ర డిమాండ్ మేరకు వీరికి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు కూడా వెనకడుగు వేయట్లేదు. వీరంతా కూడా మాడ్రన్ అమ్మల్లా కనిపించడంతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. పైగా వీరికి కూడా అభిమానులు కూడా ఉండటంతో.. అది సినిమాకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు నిర్మాతలు.
Also Read: మహేశ్ బాబు ఖాతాలో కొత్త యాడ్.. వీడియో హాలివుడ్ రేంజ్‌లో ఉందిగా..!
1980 స్ లో స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ లిస్ట్.. ఎవరికి ఎక్కువ అంటే ?
లక్ష్మీ పార్వతి కంటే ముందే ఆ హీరోయిన్‌ను రెండో పెండ్లి చేసుకోవాలనుకున్న ఎన్టీఆర్.. కానీ!