తెలంగాణలో ఇక ఫ్యాన్ గుర్తు కనిపించదు. ఇప్పటికే పలు సంకేతాలు ఇచ్చిన జగన్ పార్టీ మూసివేతకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ర్టంలో పార్టీ కార్యక్రమాలు లేనట్లేనని భావిస్తున్నారు. వైసీపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు రాజీనామా చేయడంతో రాష్ర్టంలో పార్టీ ఖాళీ అయినట్లే. ఇన్నాళ్లు ఎంతో కొంత నమ్మకంతో ఉన్న కార్యకర్తలు అధ్యక్షుడి రాజీనామాతో తెలంగాణలో ఇక ప్రాభవం కోల్పోయినట్లేనని తెలుస్తోంది.
పార్టీ గుర్తుతో గెలిచినా..
పార్టీ గుర్తుతో గెలిచిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వారు కూడా జగన్ అనుమతితోనే పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తెలంగాణలో పార్టీ తన ప్రభావం చూపదని తెలుసుకున్న జగన్ ఏపీ పైనే దృష్టి కేంద్రీకరించారు. ఏపీలోనే అధికారం చేజిక్కించుకునేందకు పావులు కదిపారు. చివరికి విజయం సాధించారు. అందుకే తెలంగాణలో వైసీపీ ప్రభావం అంతగా లేకుండా పోయింది. అప్పట్లో వారు గెలిచినా జగన్ ఆసక్తి కనబరచలేదు.
షర్మిల పార్టీ పెట్టినా?
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టినా పెద్ద ప్రభావం చూపించలేదని పలువురు పేర్కొంటున్నారు. షర్మిల పార్టీ పెట్టినా ఇక్కడ అంత ప్రభావం చూపకపోవచ్చని భావిస్తున్నారు. జగన్ ఆశీస్సులతోనే పార్టీ కార్యకర్తలు షర్మిల పార్టీలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ కూడా తెలంగాణలో అంతగా తన ప్రాభవాన్ని చూపించదనే చెబుతున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించినా అంతలా తన ప్రభంజనం వీయదని తెలుస్తోంది. ఎన్ని చేసినా సీమాంధ్ర అనే పేరుతో సంబోధించి ప్రచారానికే పరిమితం చేస్తారని పలువరు విశ్లేషకులు చెబుతున్నారు.
దుకాణం మూసేందుకే..
తెలంగాణలో వైసీపీ దుకాణం మూసివేసేందుకు జగన్ నిర్ణయించుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉన్న మైత్రి వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ తో ఉన్న అనుబంధం వల్ల ప్రత్యర్థులుగా ఉండలేమని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీని తక్షణమే మూసి వేయాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ప్రభావం చూపించి క్రితం మెజార్టీని సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే తెలంగాణలో పార్టీని లేకుండా చేసేందకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏపీ ఎన్నికల్లోనే గతంలో సాధించిన విజయాన్ని పునరావృతం చేయాలని భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.