https://oktelugu.com/

చిరంజీవి ఏమనుకుంటారో ? ఉంచుతారో ? లేదో ?

చిరంజీవికి ‘సుప్రీమ్ హీరో’ అనే బిరుదు వచ్చిన రోజులు అవి, ‘ఖైదీ నెంబర్‌ 786’ సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాలో విలన్ పాత్ర చాల కీలకమైనది. దాంతో ఆ పాత్రకి రావుగోపాలరావు లాంటి పెద్ద ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని, ఆ చిత్ర నిర్మాత విజయబాపినీడు గారు ఫిక్స్ అయ్యారు. దర్శకుడు కూడా నిర్మాత అభిప్రాయానికి ఓకే చెప్పాడు. కానీ, చిరంజీవికి మాత్రం ఆ పాత్ర కోట శ్రీనివాసరావు చేస్తే బాగుంటుందని అనిపించింది. […]

Written By: , Updated On : May 15, 2021 / 06:36 PM IST
Follow us on

khaidi 789చిరంజీవికి ‘సుప్రీమ్ హీరో’ అనే బిరుదు వచ్చిన రోజులు అవి, ‘ఖైదీ నెంబర్‌ 786’ సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాలో విలన్ పాత్ర చాల కీలకమైనది. దాంతో ఆ పాత్రకి రావుగోపాలరావు లాంటి పెద్ద ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని, ఆ చిత్ర నిర్మాత విజయబాపినీడు గారు ఫిక్స్ అయ్యారు. దర్శకుడు కూడా నిర్మాత అభిప్రాయానికి ఓకే చెప్పాడు. కానీ, చిరంజీవికి మాత్రం ఆ పాత్ర కోట శ్రీనివాసరావు చేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే నిర్మాతకు ఇష్టం లేకపోయినా, పట్టుబట్టి ఆ పాత్రను కోటాకు ఇప్పించారు మెగాస్టార్.

కట్ చేస్తే.. షూటింగ్ మొదలెట్టారు. ఆ రోజు కోట శ్రీనివాసరావు, చిరంజీవి అలాగే ఇతర ప్రముఖ నటులు అందరూ షూట్ లో పాల్గొనాలి. అందరూ సెట్ కి వచ్చారు, కోట మాత్రం ఎక్కడా కనబడలేదు. చిరు ‘ఏమైంది, కోట రాలేదు’ అని ఆరా తీస్తున్నారు. కానీ కోట మాత్రం కృష్ణగారు హీరోగా నటిస్తున్న పరశురాముడు అనే సినిమా షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పైగా కోర్టు ఎపిసోడ్‌ షూటింగ్ కాబట్టి సీరియస్ గా జరుగుతోంది. అదే రోజు తనకు చిరంజీవి సినిమా తొలి రోజు షూటింగ్‌ ఉందని కోట శ్రీనివాసరావుకి తెలుసు.

కానీ ‘రెండు గంటల్లో మా షూట్ అయిపోతుంది. ఇంపార్టెంట్‌ సీన్, మీరు రావాలి’ అంటూ కృష్ణగారు అడిగేసరికి, కోట ఎదురు చెప్పలేక షూటింగ్ కి వచ్చారు. కానీ రెండు గంటలు కాస్త ఐదు గంటలు అయిపోయింది. కోట టెన్షన్ టెన్షన్ గా చిరు సినిమా సెట్ కి బయలుదేరాడు. అసలుకే చిరంజీవిగారితో తొలి సినిమా. పైగా చిరు రికమండ్ చేయించి ఫస్ట్ టైం తనకు మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇప్పించారు. పైగా ఆరు గంటలు ఆలస్యం అయింది, చిరంజీవి ఏమనుకుంటారో? అసలు నన్ను ఉంచుతారో? లేదో ? అనుకుంటూ కోట శ్రీనివాసరావు భయపడుతూ చిరంజీవి సినిమా సెట్ కి వచ్చాడు.

ఎదురుగా నిర్మాత విజయబాపినీడుగారు సీరియస్ గా చూస్తున్నారు. ఆయనలో కోపం పెరిగింది. ‘ఏమయ్యా ఏమనుకుంటున్నావ్‌? ఇక్కడ పెద్ద నటులందరూ ఎదురుచూస్తున్నారు’ అని ఆయన ఆవేశంతో ఊగిపోతున్నారు. కోట భయం భయంగానే దూరంగా ఉన్న చిరంజీవిగారి దగ్గరికి వెళ్లి సంజాయిషి చెబుతున్నారు. ‘టెన్షన్ ఏమీ లేదండీ. ఆర్టిస్టుగా బిజీ అవుతున్నకొద్దీ ఇలా కాల్షీట్ల సర్దుబాటు తప్పదు లేండి’ అని చిన్న చిరునవ్వుతో అన్నారు చిరంజీవి. ఎదుటివారి సమస్యను చిరు అంత బాగా అర్ధం చేసుకునేవారు.