https://oktelugu.com/

వైరల్ : స్టార్లందరూ అభిమానించిన పాట !

అప్పుడెప్పుడో ‘వై దిస్‌ కొలవెరి’కి అంటూ సోషల్ మీడియా వెర్రెత్తిపోయింది. ఆ తరువాత గంగ్నమ్‌ డ్యాన్స్‌ అంటూ ఓ వీడియో, డిజిటల్ మీడియాలో తెగ గంతులేసింది. ఆ తరువాత కాలంలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కన్ను కొట్టిన వీడియో తెగ వైరల్ అవుతూ సోషల్ ప్లాట్ ఫామ్స్ అన్నిటినీ తెగ షేక్ చేసి పారేసింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఒక ఊపు ఊపేస్తోంది మరొక పాట ఒకటి. అదే ‘ఎంజాయ్‌ ఎంజామీ’ది. మార్చి 7, 2021న యూట్యూబ్‌ […]

Written By:
  • admin
  • , Updated On : May 15, 2021 / 06:18 PM IST
    Follow us on

    అప్పుడెప్పుడో ‘వై దిస్‌ కొలవెరి’కి అంటూ సోషల్ మీడియా వెర్రెత్తిపోయింది. ఆ తరువాత గంగ్నమ్‌ డ్యాన్స్‌ అంటూ ఓ వీడియో, డిజిటల్ మీడియాలో తెగ గంతులేసింది. ఆ తరువాత కాలంలో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కన్ను కొట్టిన వీడియో తెగ వైరల్ అవుతూ సోషల్ ప్లాట్ ఫామ్స్ అన్నిటినీ తెగ షేక్ చేసి పారేసింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఒక ఊపు ఊపేస్తోంది మరొక పాట ఒకటి. అదే ‘ఎంజాయ్‌ ఎంజామీ’ది.

    మార్చి 7, 2021న యూట్యూబ్‌ వేదికగా విడుదలైన ఈ మ్యూజిక్‌ వీడియో ప్రెజెంట్ ట్రెండ్‌ కి తగ్గట్టు ఉండటంతో కేవలం రెండు నెలల్లోనే 200 మిలియన్‌ వ్యూస్‌ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. అరివు అందించిన మధురమైన సాహిత్యం, అలాగే ఈ పాటను తన అద్భుతమైన గాత్రంతో గాయని దీ(దీక్షితా వెంకటేశన్‌) ఆలపించిన విధానం ఈ పాటకు ఒక స్థాయిని తీసుకువచ్చింది.

    అలాగే అమిత్‌ కృష్ణన్‌ దర్శకత్వం కూడా చాల బాగుంది. దాంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ పాటను నిర్మించిన సంతోష్‌ నారాయణ్‌ పెట్టుబడికి ఒక విలువ వచ్చింది. ఏది ఏమైనా ఇప్పుడున్న భారీ డిజిటల్ పోటీలో అతి తక్కువ సమయంలోనే అన్ని వేదికల్లోనూ ‘ఎంజాయ్‌ ఎంజామీ’ పాటకి విశేష స్పందన లభించడం నిజంగా గొప్ప విషయమే. తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ ఈ పాట పై అనేక ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.

    వారిలో హీరో ధనుశ్‌ తో పాటు హీరోయిన్ సాయి పల్లవి, మాజీ హీరో సిద్ధార్థ్‌, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌, మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్‌ కనకరాజ్‌, క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇలా ఎంతోమంది ఈ పాటకు అభిమానులుగా మారిపోయారు. ఈ పాట ఓ అద్భుతం అంటూ అందరూ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.

    అందుకే సామాజిక మాధ్యమాల వేదికగా ఈ పాటకు వందలాది కవర్‌ సాంగ్స్‌ వచ్చాయి. ఇక కేరళ, తమిళనాడు పోలీసులు అయితే, ఈ పాటతోనే కరోనా వైరస్‌, మాస్క్‌ ధరించడం పై అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఈ ఎంజాయ్‌ ఎంజామీ పాటను మాజా లేబుల్‌ పై ఏఆర్‌ రెహమాన్‌ విడుదల చేశారు.