
సీఎం జగన్ పాలనాకాలం రెండేళ్లు పూర్తయింది. కరోనా కారణంగా జగన్ ప్రజల వద్దకు వెళ్లడం వీలు కాలేదు. దీంతో పరిపాలన అంతా క్యాంపు కార్యాలయం నుంచే నిర్వహించారు దీంతో ప్రజల మధ్యకు వెళ్లకపోవడంతో కార్యకర్తల్లో కూడా అసహనం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఇక ప్రజల మధ్యకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. గతంలోనే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలను కలవాలని నిర్ణయించుకున్నారు. స్వయంగా ప్రజల సమ్యలు తెలుసుకుని పరిష్కారం కనుగొనాలని భావించారు.
పార్టీ కార్యక్రమాలపై జగన్ ఫోకస్ పెట్టారు. తన తండ్రి చేసిన విధంగానే తాను కూడా కార్యకర్తలతో సమావేశం కావాలని ఆశిస్తున్నారు. అక్టోబర్ రెండు నుంచి ఈ కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. సచివాలయ పనితీరును క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు. దీనికి రచ్చబండ కార్యక్రమాన్ని ఉపయోగించుకోనున్నారు.
వారంలో రెండు ప్రాంతాల్లో రచ్చబండ నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ముందు సమాచారం ఇచ్చి ఉదయం సమాచారం ఇచ్చి మధ్యాహ్నం లోగా అక్కడకు వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. దసరా నుంచి విశాఖలో తన క్యాంపు కార్యాలయం ద్వారా విధులు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. జగన్ తన రెండేళ్ల పాలన కాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు ఎంత మేర లబ్ధిపొందారని తెలుసుకోనున్నారు.
దసరా నుంచి రెండు రోజులు కచ్చితంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వారంలో రెండు సార్లు రెండు జిల్లాల నేతలతో సీఎం సమావేశం కానున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో వారిలో నైరాశ్యం పెరిగిపోతున్నందున కార్యకర్తలను నేరుగా కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
సెప్టెంబర్ 15 నుంచి సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు జరపాలని నిర్ణయించుకున్నారు. కరోనా ప్రభావంతో అన్ని కార్యక్రమాలు వెనుకబడి పోవడంతో అక్టోబర్ రెండు నుంచి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారు. సీఎం జగన్ ప్రజల చెంతకు చేరాలని నిర్ణయించుకోవడంతో మరోసారి రాజకీయాలు మారనున్నాయని తెలుస్తోంది