జగన్ ఆస్తుల కేసు: మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో మళ్లీ సీబీఐ ట్విస్ట్ ఇచ్చింది. సీబీఐ ఈడీ కోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఇదివరకే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ లో కూడా సీబీఐ ఏ అభిప్రాయాన్ని తేల్చకుండా నాన్చి నాన్చి జడ్జీలకే నిర్ణయాధికారాన్ని వదిలేసిన సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ లో లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ ఇవ్వలేదు. సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని సీబీఐ తరుఫున […]

Written By: NARESH, Updated On : August 7, 2021 11:07 am
Follow us on

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో మళ్లీ సీబీఐ ట్విస్ట్ ఇచ్చింది. సీబీఐ ఈడీ కోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఇదివరకే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ లో కూడా సీబీఐ ఏ అభిప్రాయాన్ని తేల్చకుండా నాన్చి నాన్చి జడ్జీలకే నిర్ణయాధికారాన్ని వదిలేసిన సంగతి తెలిసిందే.

జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ లో లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ ఇవ్వలేదు. సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని సీబీఐ తరుఫున న్యాయవాది కోర్టుకు వెళ్లడించారు. మరింత సమయం కావాలని విన్నవించారు. దీనిని రఘురామ తరుఫున న్యాయవాది వ్యతిరేకించారు. గడువు ఇవ్వొద్దని హైకోర్టులో విజ్ఞప్తి చేశారు. ఇదే రోజు సీబీఐ ఏదో ఒకటి చెప్పాలని.. మరింత సమయం ఇస్తామని విచారణను కోర్టు వాయిదా వేసింది. కొంత సేపటి అనంతరం సీబీఐ న్యాయవాది వచ్చి.. తాము ఈ కేసులో ఎలాంటి వాదనలు వినిపించడం లేదని.. విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు.

ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..ఈ కేసులో విచారణ ముగిసిందని.. ఆగస్టు 25న తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. దీంతో జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

ఆ కేసులో తీర్పు వెలువడాల్సి ఉండగా.. పెన్నా కేసు నుంచి తన పేరు తొలగించాలన్న జగన్ పిటీషన్ పై తాజాగా విచారణ వాయిదా పడింది. జగన్ డిశ్చార్జి పిటీషన్ పై కౌంటర్ దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఇలా జగన్ కేసుల్లో మరోసారి సీబీఐ గడువు కోరడం విశేషం. దీంతో దీనిపై విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేశారు.