
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలిసిన వైఎస్ జగన్ పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.. అయితే అమిత్ షాను కలవక ముందే ఓ సంచలన ఉత్తర్వు జారీ చేశారు. అదేమిటంటే.. ఏబీవీపై మరో ఆరు నెలల పాటు సస్పెన్షన్‌ను పొడగిస్తున్నట్లు ఏపీ సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read: ఏపీ డీజీపీ ఉగ్రరూపం.. పచ్చపార్టీ నేతలకు గట్టి వార్నింగ్
చంద్రబాబు హయాంలో ఏపీ పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్ గా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుకు జగన్ సర్కారు మరో షాకిచ్చింది. దేశభద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో ఇప్పటికే ఆయనపై వేటు వేసింది. తాజాగా ఆయనపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆగస్టు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీవీ.. దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు, డ్రోన్ల కొనుగోళ్లు చేశారని, అందులో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఐపీఎస్ అధికారిపై ఈరకమైన ఉత్తర్వులు జారీ కావడం చర్చనీయాంశమైంది.
Also Read: బీచ్ రోడ్డు బిల్డింగుల పని అయిపోయినట్లే..!
జగన్ సర్కార్ పై ఏబీ ఇప్పటికే న్యాయపోరాటానికి దిగారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని, అక్రమంగా చర్యలకు ఉపక్రమించిదంటూ ఏబీవీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయన సస్పెన్షన్‌పై గతంలో స్టే వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం వేటును కొనసాగించింది. డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో ఏబీవీ నేరానికి పాల్పడ్డారనడానికి ఆధారాలున్నాయంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్) ఇదివరకే స్పష్టం చేయడం సహా, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలో ఏబీ సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్