mla roja: వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగిన రోజా అంటే జగన్ కు ప్రత్యేక అభిమానమే. ఆమెకు మంత్రి పదవి విషయంలో అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి ప్రతి సారి ఊరిస్తూనే ఉంది. అక్కడ ఉన్న సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దరి చేరడం లేదు. కానీ ఆమె అనుకున్న పనులు మాత్రం నెరవేర్చడంలో జగన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేసేస్తారు. ఇందులో భాగంగానే ఆమె ఇటీవల తన డిమాండ్లు చెప్పగా సానుకూలంగా స్పందించి ఆమె చెప్పిన పనులు చేసి పెట్టారు.
దీంతో జగన్ పై రోజా ప్రశంసల జల్లు కురిపించారు. జగనన్న అండగా ఉండగా తమకు లోటు లేదని ప్రకటించారు. నగరి లో రోజాకున్న ఇమేజ్ ను ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా జగన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. దీంతో నగరిని రెవెన్యూ డివిజన్ చేయాలని రోజా కోరడంతో తక్షణమే అమలు చేశారు. చంద్రబాబు ఇన్నేళ్ల పాలనలో చేయలేనిది జగన్ మూడేళ్లలోనే చేశారని చెప్పుకొచ్చారు
Also Read: KCR vs Modi: ఢిల్లీ వేదికగా కేసీఆర్ పోరాటం ఫలిస్తుందా?
పుత్తూరు, వడమాల పేట మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని కోరారు. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో వాటిని చిత్తూరులో కలపొద్దని రోజా సూచించారు. దీనికి కూడా జగన్ సానకూలంగానే స్పందించారు. వాటిని తిరుపతిలోనే కలిపి రోజాకు మద్దతుగా నిలిచారు.దీంతో రోజా ఆనందం వ్యక్తం చేశారు. జగనన్న ఉండగా తమకు ఇబ్బందులేవి ఉండవని ఉద్వేగంతో చెప్పారు. దీంతో రోజా ప్రజల కోరిక నెరవేర్చగలిగారు.
జగన్ ఆడపడుచులకు అన్యాయం చేయరని ఆకాశానికెత్తారు. తమ అభిరుచులను గుర్తించి ఏం కావాలో అడిగితే చాలు క్షణాల్లో చేసే జగనన్న అని తనదైన శైలిలో ప్రశంసించారు. జగన్ తొందరగా స్పందించి మా ప్రాంత వాసుల కోరికలు తీర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ పాలనపై రోజా ఆయనకు ఇక తిరుగులేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగనే ముఖ్యమంత్రి అని కొనియాడుతున్నారు.
Also Read:Chiranjeevi Anasuya : అనసూయతో చిరంజీవి.. ఈ రోమాన్స్ తో దొరికిపోయాడు!