Drugs In Hyderabad: డ్రగ్స్ నిరోధానికి ప్రభుత్వం కృషి చేస్తున్నా సాధ్యం కావడం లేదా?

Drugs In Hyderabad: హైదరాబాద్ ను డ్రగ్స్ మూలాలు వీడటం లేదు. పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా అడ్డదారుల్లో అక్రమంగా మత్తు పదార్థాల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. ఆదివారం ఓ పబ్ లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది మత్తు పదార్థాలు తీసుకున్నట్లు రుజువు అయింది. అందరు సెలబ్రిటీలు కావడంతో కేసు పెట్టేందుకు పోలీసులు కూడా ముందుకు రావడం లేదు. ఫలితంగా అందరిని వదిలేశారు. దాదాపు 150 మంది పట్టుబడ్డారంటే మత్తు పదార్థాల వ్యాపారం […]

Written By: Srinivas, Updated On : April 4, 2022 8:54 am
Follow us on

Drugs In Hyderabad: హైదరాబాద్ ను డ్రగ్స్ మూలాలు వీడటం లేదు. పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా అడ్డదారుల్లో అక్రమంగా మత్తు పదార్థాల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. ఆదివారం ఓ పబ్ లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది మత్తు పదార్థాలు తీసుకున్నట్లు రుజువు అయింది. అందరు సెలబ్రిటీలు కావడంతో కేసు పెట్టేందుకు పోలీసులు కూడా ముందుకు రావడం లేదు. ఫలితంగా అందరిని వదిలేశారు. దాదాపు 150 మంది పట్టుబడ్డారంటే మత్తు పదార్థాల వ్యాపారం ఎంతలా పెరిగిపోయిందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల నిరోధకం ముందుకు సాగేలా కనిపించడం లేదు.

Drugs In Hyderabad

ఏదో ఒక చోటు పట్టుకుంటే పది స్థలాల్లో దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ ను అదుపు చేయడం కష్టంగానే కనిపిస్తోంది. యువత ఎక్కువగా వీటిపై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ యువకుడు మత్తు పదార్థాలకు బానిసై ప్రాణాలు పోగొట్టుకోవడం బాధే అనిపించినా ఏం చేయలేని పరిస్థితి. ఇందులో అందరు బాగా చదువుకున్న వారే తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటూ దందా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

Also Read: MLA Roja: మాట నెగ్గించుకున్న ఎమ్మెల్యే రోజా

నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే మాన్ సీ అనే యువతి మొదట గంజాయికి అలవాటు పడి ఇక తరువాత తానే వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. ఇదేదో బాగుందని దందాలో దిగి తన భవిష్యత్ నే నాశనం చేసుకుంది. పోలీసులకు చిక్కడంతో విషయమంతా బయటకు వచ్చి తన పరువు తీసుకుంది. ఓ యువకుడి ద్వారా గంజాయికి అలవాటు పడి తరువాత వ్యాపారం చేసే స్థాయికి చేరడం విస్తుగొలిపేదే. ఇలా ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతలా కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది.

Drugs In Hyderabad

తెలంగాణ ప్రభుత్వం కూడ డ్రగ్స్ నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా వ్యాపారం మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక మార్గంలో కొనసాగుతూనే ఉంది. దీంతో యువత మత్తులోనే తూగుతోంది. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. గంజాయి రవాణా చేసే లక్ష్మీపతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు పరారీలో ఉన్నాడు. గంజాయి వ్యాపారానికి కేంద్ర బిందువుగా ఉన్న లక్ష్మీపతి దొరికితే అతడి ద్వారా ఇంకా కొందరు పట్టుబడే అవకాశమున్నందున తప్పించుకు తిరుగుతున్నాడు. కానీ ఎప్పటికైనా చట్టానికి చిక్కి శిక్ష అనుభవించే తీరుతాడు.

Also Read:KCR vs Modi: ఢిల్లీ వేదికగా కేసీఆర్ పోరాటం ఫలిస్తుందా?

Tags