https://oktelugu.com/

జగన్‌.. మరో చారిత్రక నిర్ణయం

ఖజానా లేకున్నా.. పథకాలతో హోరెత్తిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. అంచనాలకు అందకుండా నెలకో కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అయితే.. మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. గ్రామాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు మరో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారట. నిత్యం గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఓ కంట కనిపెడుతూ వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అవగాహన ఉండే ఫ్యామిలీ డాక్టర్ తరహా వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. Also Read: అచ్చెన్నాయుడు, రామానాయుడుకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 23, 2020 2:56 pm
    Follow us on

    CM Jagan
    ఖజానా లేకున్నా.. పథకాలతో హోరెత్తిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. అంచనాలకు అందకుండా నెలకో కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అయితే.. మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. గ్రామాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు మరో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారట. నిత్యం గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఓ కంట కనిపెడుతూ వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అవగాహన ఉండే ఫ్యామిలీ డాక్టర్ తరహా వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు.

    Also Read: అచ్చెన్నాయుడు, రామానాయుడుకు నోటీసులు

    సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ‘ఆస్పత్రుల్లో నాడు- నేడు’పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ మండలంలో కనీసం 2 పీహెచ్‌సీలు ఉండాలని ప్రతీ పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు చొప్పున.. మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని ప్రతి డాక్టర్‌‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలని చెప్పారు. ఆ డాక్డర్ ప్రతినెలా కనీసం రెండుసార్లు తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి వైద్యం అందించాలని తద్వారా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితుల మీద అతనికి అవగాహన ఏర్పడుతుందన్నారు.

    ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశావర్కర్లు కూడా డాక్టర్‌‌కు తోడుగా ఉంటారని.. 104 వాహనాల ద్వారా వారికి చికిత్స అందించడం సులభం అవుతుందని వివరించారు. అలాగే నిరంతరం హోం విజిట్స్ కూడా చేయాలని.. అవసరం అనుకుంటే 104లను కూడా పెంచుకోవాలని సూచించారు. డాక్టర్లు సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్ కూడా వేదికగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. కొంతకాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై సంబంధిత డాక్టర్‌‌కు పూర్తి అవగాహన ఏర్పడుతుందన్నారు. దీంతో గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తుందని వైద్యం చేయడం కూడా సులభమవుతుందని చెప్పారు.

    Also Read: బీజేపీ–జనసేన పొత్తు చెడిందంటూ ప్రచారం

    అలాగే 2021 డిసెంబర్ నాటికి పలాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2023 జూన్ నాటికి కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు తెలిపారు. ఐటీడీఏల పరిధిలోని 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించే దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. అలాగే వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లీనిక్ ల పనులు జనవరి నెలాఖరుకు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో కరోనా మళ్లీ పంజా విసరడంతో బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలను విధించారని.. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. సూపర్ స్పెషాల్టీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న సదుపాయాలపై సీఎం సమీక్షించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం సిబ్బంది ప్రభుత్వానికి ఉన్నారని అధికారులు వెల్లడించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్