లాక్ డౌన్ పై తేల్చాడు.. ఈటెల ఫస్ట్రేషన్ ఎవరిపై?

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తన ఆవేదన ఆగ్రహాన్ని అంతా తాజాగా బయటపెట్టాడు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పాపం ఈటెల కంటి మీద కునుకు లేకుండా పోయింది. అన్ని శాఖల మంత్రులు ఈ కరోనా లాక్ డౌన్ వేళ ఇంట్లో సేదతీరుతుంటే మంత్రి ఈటల మాత్రం కరోనాను కట్టడిచేయడానికి తెగ కష్టపడుతున్నాడు. ఆస్పత్రులు, రోగులు, వైద్యపరికరాలు, వ్యాక్సిన్ల పంపిణీపై తిరుగుతూనే ఉన్నాడు.. ఇక ప్రతిపక్షాలు ప్రధానంగా తెలంగాణలో కరోనా […]

Written By: NARESH, Updated On : April 29, 2021 4:31 pm
Follow us on

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తన ఆవేదన ఆగ్రహాన్ని అంతా తాజాగా బయటపెట్టాడు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పాపం ఈటెల కంటి మీద కునుకు లేకుండా పోయింది. అన్ని శాఖల మంత్రులు ఈ కరోనా లాక్ డౌన్ వేళ ఇంట్లో సేదతీరుతుంటే మంత్రి ఈటల మాత్రం కరోనాను కట్టడిచేయడానికి తెగ కష్టపడుతున్నాడు. ఆస్పత్రులు, రోగులు, వైద్యపరికరాలు, వ్యాక్సిన్ల పంపిణీపై తిరుగుతూనే ఉన్నాడు..

ఇక ప్రతిపక్షాలు ప్రధానంగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై విమర్శలు గుప్పిస్తుండడం.. హైకోర్టు సైతం తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా మంత్రి ఈటల రాజేందర్ బరెస్ట్ అయిపోయాడు. కేంద్రంపై బీజేపీపై నిప్పులు చెరిగాడు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాలపై ఆ పార్టీ నేతలు ఎందుకు ప్రశ్నించరు అని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల నుంచి జనాలు రావడం వల్లే తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయన్నారు.

వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు అన్ని కేంద్రం చేతిలోనే పెట్టుకున్నారని తమను ఎందుకు నిందిస్తున్నారని ఈటల ప్రశ్నించారు. డిల్లీలోపాటు అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సమాధానం చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. తెలంగాణపై కొంతమంది కేంద్రం పెద్దలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని.. ఏడాది నుంచి కరోనా కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి ఈటల తెలిపారు.అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాలపై ఆరోపణలు చేయడం ఏంటని.. ఆక్సిజన్ తో కరోనా రోగులు చనిపోవడం దేశానికి అవమానం అని ఈటల కేంద్రంపై నిప్పులు చెరిగారు.

అయితే తెలంగాణలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అటు హైకోర్టు ఎంత దుమ్మెత్తిపోస్తున్న టెస్టుల సంఖ్య పెంచకుండా.. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి కేసీఆర్ సర్కార్ ఏమాత్రం అడ్డుకట్ట వేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి విషయంలో సరిదిద్దకుండా మంత్రి ఈటల తన ఫస్ట్రేషన్ ను అంతా కేంద్రంపై చూపించాడా? అన్న టాక్ నడుస్తోంది.