IT raids on Hetero: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు వందల కోట్లు.. కాదుకాదు.. అంతకు మించిన సొమ్మే అక్కడి నుంచి బయటపడింది. ఇంకా సోదాలు జరుగుతుండగా.. మరిన్ని కోట్లు బయటపడే అవకాశం ఉందని ఐటీ శాఖ అధికారులు చెబతున్నారు. హెటెరో కార్పొరేట్ ఆఫీసులో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా భయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని ఐటీ శాఖ అధికారులు రెండు వందల కోట్లుగా లెక్క తేల్చారు. కానీ.. అంతకు మించిన సొమ్మని ప్రచారమూ జోరుగా సాగుతోంది. ఇంకా ఐటీ సోదాలు సంబంధిత కార్పొరేట్ ఆఫీసులో సాగుతున్నాయి.మరో రెండు రోజుల పాటు తనిఖీల అనంతరం సంబంధిత శాఖ అందుకు కారణాలను వివరించే అవకాశం ఉంది.

అయితే ఇంతపెద్ద మొత్తంలో డబ్బు సంబంధిత కార్పొరేట్ సంస్థలో ఎక్కడిదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల తరువాత పూర్తిస్థాయిలో లెక్కలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా సమయంలో ఈ కంపెనీ వ్యాపారం జోరుగా సాగింది. అప్పుడు బ్లాక్ లో అమ్మిన స్టెరాయిడ్ డబ్బులా లేదా మరో విధంగా ఏమైన ఆలోచన చేయవచ్చా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద ఎత్తున డబ్బు దాచుకునేందుకు కంపెనీలు ఒప్పుకోవు. ఎందుకంటే రైడ్ జరిగితే…. అది కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది.
కానీ.. అధికార పార్టీ తమదేఅనేమో.. లేదా.. దాడులు జరగవనే ధీమానో తెలియదు కానీ.. హెటెరో కంపెనీలో మాత్రం పెద్ద ఎత్తున నోట్ల కట్టలను ఐటీ అధికారులు పట్టుకున్నారు. ఇలా బహిరంగంగా దొరికిన కట్టే కాకుండా పన్ను ఎగవేత దగ్గరి నుంచి మనీ లాండరింగ్ వరకు అనేక కొత్తకొత్త అంశాలు బయటపడే అవకాశం ఉందని చర్చ జోరుగా సాగుతోంది. ఇంత ఆకస్మికంగా దాడులు జరగడం ఏంటి.? దీనివెనక హస్తం ఎవరిదనే కోణంలో కంపెనీవాళ్లు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా.. రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.