IT layoffs India latest news: లే ఆఫ్ లు కొనసాగుతున్నాయి. ఐటీ ఉద్యోగుల జాబ్ లు పోతున్నాయి. మనదేశం నుంచి మొదలు పెడితే అమెరికా వరకు ఇదే పరిస్థితి. ఉద్యోగాలు పోతే వచ్చే అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఐటీ విభాగంలో పని చేసే వారు నరకం చూస్తున్నారు. ఉద్యోగం లేక.. వచ్చే అవకాశం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చెల్లించాల్సిన ఈఎంఐలు, అప్పులు కొండల మాదిరిగా పేరుకుపోతున్నాయి.
లే ఆఫ్ ల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఎన్విడియా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలో ఉంటున్న భారతీయ హెచ్ 1 బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. లేకపోతే అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు మొత్తం ఉద్యోగాలను తొలగిస్తున్న నేపథ్యంలో అనిశ్చితి వాతావరణం ఏర్పడింది.
ఈక్రమంలో ప్రఖ్యాత ఐటీ కంపెనీ ఎన్ వీడియా విదేశాలలో ఉన్న ప్రతిభావంతులపై ఫోకస్ పెట్టింది. ఈనేపథ్యంలో హెచ్ 1 బీ వీసాదారులను లక్ష్యంగా చేసుకుంది. వారికి ఇచ్చే నియామకాలను పెంచింది. ఈ ఏడాది తొలి రెండు క్వార్టర్ లలో 1200మంది హెచ్ 1 బీ విభాగం కింద ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అనుమతులను అమెరికా ప్రభుత్వం నుంచి పొందింది.
అమెరికాకు హెచ్ 1 బీ వీసాదారులను భారత్ అధికంగా అందిస్తోంది. గత ఏడాది ఈ కంపెనీ హెచ్ 1బీ వీసాదారుల కేటగిరీలో వేయి మందికి ఉద్యోగాలు కల్పించింది ఎన్ వీడియా. ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్1 బీ వీసాదారుల్లో 70 శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారు. ఆ వీసా కింద ఉద్యోగాలు కల్పించే స్థాయి పెరిగితే భారతీయుల పంట పండినట్టే.
ఎన్విడియా నియామకాలను జోరుగా పెంచుతోంది. ఇంజనీరింగ్, ఏఐ విభాగాలలో భారీగా ఉద్యోగులను భర్తీ చేస్తోంది. భారీగా వేతనాలు కూడా ఇస్తోంది. ఒక ఇంజనీర్ కు ఏకంగా 3.72 కోట్లు, రీసెర్చ్ శాస్త్రవేత్తకు రూ.3.39 కోట్లు, ప్రొడక్ట్ మేనేజర్ కు రూ.3.61 కోట్లు, హార్డ్ వేర్ ఇంజనీర్ మేనేజర్లకు రూ. 3.50 కోట్లు, డైరక్టర్ స్థాయి వ్యక్తులకు రూ. 4.64 కోట్ల దాకా ఇస్తోంది. స్టాక్ గ్రాంట్లను, బోనస్ లు కూడా ఇస్తోంది.
ముఖ్యంగా ఏఐ అల్గారిథంఇంజనీర్లు, ప్రిన్సిపల్ సిస్టమ్ సాఫ్ట్ వేర్ ఇంజనర్లకు రూ.4 కోట్లకు పైగా వేతనాలు ఇస్తోంది. కస్టమర్ ఫేజింగ్, క్లౌడ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్, చిప్ డిజైన్, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ వంటి విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఎన్వీడియా.
