Cyber Towers Hyderabad: ఎక్కడో రాళ్ళ గుట్టల్లో మహా నగరం మొలుస్తుంది ఎవరు కలగంటారు? అందులో ఐటీ సిటీ ఏర్పాటు అవుతుందని ఎవరు అనుకుంటారు? కానీ ఆ అనుమానాలను పటా పంచలు చేసింది హై టెక్ సిటీ. నేడు సైబరాబాద్ అనే మరో నగరానికి కారణమైంది. వందలాది కంపెనీలు, వేలాది కోట్ల ఆదాయం, లక్షలాది మందికి ఉద్యోగాలు.. ఇప్పుడు ఆ లెక్కే వేరు.. ఏకంగా బెంగళూరునే దాటేసే స్థాయికి ఎదిగింది. మైక్రో సాఫ్ట్,గూగుల్, అమెజాన్, ఆడోబ్, ఆపిల్.. ఇప్పుడు హైదరాబాదులో లేని కంపెనీ అంటూ లేదు. కానీ ఈ స్థాయికి వెతకడం వెనక ఎంతో కష్టం ఉంది. ఎన్నో సంవత్సరాల శ్రమ ఉన్నది.
Also Read: Jagan- MLAs: వైసీపీలో మొదటి, చివరి టాప్ 10 ఎమ్మెల్యేలు ఎవరో వెల్లడించిన జగన్.. వైరల్
1992 అప్పటి కార్మిక శాఖ మంత్రి పి జె ఆర్ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సహాయంతో ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేత హైదరాబాద్ నగరానికి సాఫ్ట్వేర్ కంపెనీలు తెప్పించారు. ఆ తర్వాత 1998లో చంద్రబాబు నాయుడు అప్పటి ప్రధానమంత్రి వాజ్ పేయి చేతుల మీదుగా మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలను ఆవిష్కరింపజేశారు. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ నిర్మించేందుకు చంద్రబాబు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ నిర్మాణం బాధ్యతలు ఎల్ అండ్ టి కంపెనీకి అప్పగించారు.. దీని తర్వాత అది ఒక ఐకానిక్ సింబల్ అయింది. హైదరాబాద్ నగరానికి కాదు కాదు తెలంగాణకి ప్రధాన ఆదాయ వనరు అయింది. దీని తర్వాత రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వంటివి నిర్మితం కావడంతో హైదరాబాద్ దిశా దశ ఒక్కసారిగా మారిపోయింది.. ఏకంగా సైబరాబాద్ అనే కొత్త నగరం వెలిసింది.. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, కొంపల్లి ప్రాంతాలను కలుపుతూ ఏర్పడిన సైబరాబాద్ సిటీ మరో సిలికాన్ వ్యాలీని తలపిస్తోంది..
వాస్తవానికి సైబర్ టవర్స్ కట్టే ముందు ఎక్కడో ఊరి చివర, రాళ్ల మధ్యలో చుట్టూ గుంటలాగా అదేదో కడుతున్నారు. అందులో గబ్బిలాలు పడుకుంటాయి.. ఈ మాత్రం దానికి ఏదో చెబుతున్నారు.. అంటూ ఓ మాజీ ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. ఐదేళ్లు తిరిగేలోపే హైదరాబాద్ దేశంలోనే మోస్ట్ హపెనింగ్ సిటీ అయిపోయింది. సాఫ్ట్వేర్ లో ప్రపంచానికి డెస్టినేషన్ గా అవతరించింది..ఇక్కడి సాఫ్ట్వేర్ బాగా అభివృద్ధి చెందడంతో అమెరికా లాంటి దేశాలకు ఎగుమతులు ప్రారంభమయ్యాయి.. ఇక్కడ యువత అమెరికా లాంటి దేశాలు వెళ్లడం ప్రారంభమైంది.. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో పనిచేసే ప్రతి వందమందిలో 30 మంది భారతీయులు అందులో పదిమంది తెలుగువారే అంటే ఐటీ అనేది ఎంత చొచ్చుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం మైక్రో సాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లాంటి వారు కూడా హైదరాబాద్లోనే ఐటీ ఓనమాలు దిద్దారు.
నేడు ఎక్కడికో ఎదిగి పోయారు. ప్రపంచ ఐటీ యవనికపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తున్నారు.. కానీ ఈనాడు కనిపిస్తున్న సైబర్ టవర్స్ వెనక ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర అభివృద్ధి దిశగా అడుగులు వేసింది కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రాంతం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది.. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ డాటా సెంటర్లను హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నాయంటే ఇందుకు కారణం కూడా అదే.. రాళ్ళల్లో రప్పల్లో ఐటీ టవర్స్ నిర్మిస్తే ఏమొస్తుంది అని గేలి చేసిన వాళ్లే.. ఈరోజు సాధిస్తున్న అభివృద్ధిని చూసి అబ్బురపడుతున్నారు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. అది అద్భుతం అని తెలిశాక ఎవరూ గుర్తించాల్సిన పనిలేదు.
Also Read:Bandla Ganesh- KCR: కేసీఆర్‌పై సడెన్‌గా బండ్ల గణేశ్‌కు జ్ఞానోదయం ఎలా అయ్యింది!