Nayani Pavani: యావర్ తో డేటింగ్, ప్రశాంత్ తో మ్యారేజ్… వైల్డ్ కార్డు ఎంట్రీ నయని పావని బ్లాస్టింగ్ కామెంట్స్

అంబటి అర్జున్, అశ్విని, భోలే షావలి, పూజా మూర్తి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. చివరి వైల్డ్ కార్డు ఎంట్రీగా సీరియల్ నటి నయని పావని వచ్చింది. హోస్ట్ నాగార్జున నయని పావనిని ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు.

Written By: Shiva, Updated On : October 9, 2023 1:20 pm
Follow us on

Nayani Pavani: బిగ్ బాస్ సీజన్ 7 ఊహించని పరిణామాలతో సాగుతుంది. అసలు సెకండ్ లాంచ్ ఈవెంట్ ఉంటుందని ఊహించలేదు. షో మొదలై ఐదు వారాలు అవుతుండగా మరో ఐదుగురు కంటెస్టెంట్స్ ని ప్రవేశ పెట్టారు. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో శుభశ్రీ ఎలిమినేట్ అయ్యింది. డబుల్ ఎలిమినేషన్ అంటూ గౌతమ్ ని కూడా ఎలిమినేట్ చేశారు. అయితే గౌతమ్ కి నాగార్జున సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. అతడిని సీక్రెట్ రూమ్ కి పంపాడు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లిన విషయం తెలిసింది.

అంబటి అర్జున్, అశ్విని, భోలే షావలి, పూజా మూర్తి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. చివరి వైల్డ్ కార్డు ఎంట్రీగా సీరియల్ నటి నయని పావని వచ్చింది. హోస్ట్ నాగార్జున నయని పావనిని ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. హౌస్లో దమ్ముగా ఆడుతున్న, దుమ్ముగా ఆడుతున్న ఇద్దరు ప్లేయర్స్ ఎవరో చెప్పాలి అన్నాడు. దమ్ముగా ఆడుతున్న ప్లేయర్స్ గా ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ పేర్లు చెప్పింది. వాళ్ళు బాగా ఆడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇక దుమ్ముగా ఆడుతున్న ప్లేయర్స్ అమర్ దీప్, టేస్టీ తేజాల పేర్లు చేసింది. నయని పావనిని మరొక షాకింగ్ క్వచ్చన్ అడిగాడు నాగార్జున. యావర్, పల్లవి ప్రశాంత్, తేజా ఫోటోలను చూపిస్తూ… వీరిలో ఎవరితో స్నేహం చేస్తావ్? ఎవరితో డేటింగ్ చేస్తావ్? ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? అని అడిగాడు. ఈ రొమాంటిక్ ప్రశ్నకు నయని పావని సమాధానం చెప్పింది. తేజాతో స్నేహం చేస్తాను. యావర్ తో డేటింగ్ చేస్తాను. ఎందుకంటే అతడు హాట్ గా ఉంటాడు. తెలుగు కూడా రాదు కాబట్టి కనెక్ట్ కావడానికి సమయం పడుతుంది.

ఇక పల్లవి ప్రశాంత్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. నాగార్జున సరదాగా అడిగిన ఈ ప్రశ్నలను నయని పావని హౌస్లో నిజం చేస్తుందేమో చూడాలి. ఇక కొత్త కంటెస్టెంట్స్ రాకతో హౌస్ సందడిగా మారింది. హౌస్లో సీరియల్ బ్యాచ్ శివాజీ బ్యాచ్ అని రెండు వర్గాలు తయారయ్యాయి. వైల్డ్ కార్డుతో వచ్చిన వాళ్ళు ఏ వర్గం చేరుతారో చూడాలి. వీరిలో మెజారిటీ సీరియల్ నటులే కాబట్టి సీరియల్ బ్యాచ్ వైపు మొగ్గే అవకాశం ఉంది.