Israel Hamas Conflict: బాహుబలి సినిమా చూశారా. మొదటి పార్ట్ లో కాలకేయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు మాహిష్మతి రాజ్య పాలకులు త్రిశూల వ్యూహాన్ని అనుసరిస్తారు. తమ రాజ్యం పైకి దండెత్తి వచ్చిన కాలకేయులను అంతం చేస్తారు. సరిగ్గా ఇప్పుడు ఈ సూత్రాన్నే ఇజ్రాయిల్ పాటిస్తోంది. తమ దేశం మీద దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు బాహుబలిలో అనుసరించిన త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే గాజా పై భూతల దాడి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అక్కడి పాలస్తీనా ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా ఇజ్రాయిల్ దేశం పై రాకెట్లతో దాడులు చేశారు. వందలాది మందిని చంపేశారు. ఇజ్రాయిల్ దేశస్తులను బందీలుగా పట్టుకుని వెళ్లారు. అంతేకాదు పొరుగున ఉన్న ఇతర దేశాల సైన్యంతో ఇజ్రాయిల్ దేశంపై దాడులు చేస్తున్నారు. ఇది ఇజ్రాయిల్ దేశానికి తీవ్ర ప్రతిబంధకంగా మారింది. రక్షణ పరంగా ఎంతో పటిష్టమైన స్థితిలో ఉన్న ఇజ్రాయిల్.. హమాస్ నుంచి ఈ స్థాయిలో దాడులను ఊహించలేకపోయింది. మరోవైపు హమాస్ ఉగ్రవాదులు సిరియా, ఇరాన్, రష్యా దేశాల నుంచి భారీగా మందు గుండు సామాగ్రిని దిగుమతి చేసుకున్నారు. ఈ ప్రకారం చూస్తే ఇజ్రాయిల్ దేశం మీద మరింత భీకరంగా దాడులు చేసేందుకు వారు ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
హమాస్ ఉగ్రవాదల దాడుల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇజ్రాయిల్ తాపత్రయ పడుతోంది. హమాస్ ఉగ్రవాదులపై దాడులు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మొహరించింది. అంతేకాదు తమకు పంటికింద రాయి లాగా మారిన హమాస్ ఉగ్రవాదులను పూర్తిస్థాయిలో పెద్ద ముట్టించేందుకు ఇజ్రాయిల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదే సమయంలో భూతల దాడులు చేసి గాజా నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయిల్ ప్రణాళికలు రూపొందించింది. మొత్తంగా హమాస్ చరలో ఉన్న బందీలను విడిపించడం.. హమాస్ నాయకత్వాన్ని భూస్థాపితం చేయడం.. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి త్రిశూల వ్యూహంతో ఇజ్రాయిల్ ముందడుగు వేస్తోంది.
ఇప్పటికే గాజానగరంపై భూ, వాయు, సముద్ర మార్గాల ద్వారా ఏకకాలంలో దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. 2006 తర్వాత ఇజ్రాయిల్ చేస్తున్న భారీ ఆపరేషన్ ఇదే. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ మూడు మార్గాల్లో దాడికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం.. గాజ సరిహద్దు వెంట పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించడం.. ఆ దేశ చివరి కమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూడటం.. వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. హమాస్ ఉగ్రవాదుల దాడిలో కోల్పోయిన ప్రతి ప్రాణానికి తిరిగి వడ్డీతో సహా ఇవ్వడానికి తమ సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రతినిధి డేనయల్ హగారి స్పష్టం చేయడం విశేషం. హమాస్ లకు కంచుకోటగా ఉన్న గాజాను దురద భామలతో దెబ్బతీసి, హమాస్ ఉగ్రవాదులను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీయ విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. గాజా సరిహద్దుల్లో ఇజ్రాయిల్ 30 వేల సైన్యాన్ని మొహరించింది. అంత కూడా ముఖ్యమైన గ్రౌండ్ ఆపరేషన్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 10,000 మంది సైనికులు గాజా నగరంలో అడుగు పెట్టారు. ఏ క్షణమైన ఏదైనా జరగొచ్చు అనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు మొత్తం ఇజ్రాయిల్ ఏం చేస్తుందనే దానిని ఆసక్తిగా గమనిస్తున్నాయి.