YS Sharmila: సోషల్ మీడియా వచ్చిన తరువాత సమాజంపై ఒక క్లీన్ అబ్జర్వేషన్ పెరిగింది. అయితే ఇందులో లాభమెంత ఉందో.. మిస్ యూజ్ చేస్తే దానికి మించిన నష్టం జరిగిపోతోంది. అయితే సమాజం పట్ల బాధ్యత కలిగిన మనుషులు మాత్రం సోషల్ మీడియా ఒకటుందని గ్రహించాలి. అది వెంటాడే ఒక నిఘా నీడ అని గుర్తెరగాలి. మన ప్రతీ చర్యను వాచ్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నిన్న రిపబ్లిక్ డే వేడుకల్లో సోషల్ మీడియాకు పసందైన వార్తలు దొరికాయి. ఏపీలో పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగురవేసే సమయంలో చెప్పులు వేసుకోవడాన్ని హైలెట్ చేశాయి. అయితే యధాలాపంగా జరిగిన ఘటన కావడంతో నెటిజెన్లు లైట్ తీసుకున్నారు. ప్రత్యర్థి పేటీఎం సోషల్ మీడియా బ్యాచ్ లు అదే పనిగా ట్రోల్ చేసినా పెద్దగా ఎవరూ రియాక్ట్ కాలేదు. కాని తెలంగాణలో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిళ చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్ని తాకాయి. అన్ని రాజకీయ పక్షాలూ వేడుకలు జరపుకున్నాయి. తమదైన రీతిలో నిర్వహించుకున్నాయి. జాతిపిత గాంధీజీతో పాటు బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కానీ తెలంగాణలో మాత్రం షర్మిళ కొంచెం అతి చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ పార్టీ కార్యాలయలంో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆమె.. గాంధీజీ, అంబేడ్కర్ పక్కన రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కువ మంది ట్రోల్ చేసి కామెంట్లు పెడుతున్నారు.

అయితే షర్మిళ నోరు తెరిస్తే నాన్న పేరే వినిపిస్తుంటారు. అయితే రిపబ్లిక్ డే వేడుకల్లో తన తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. సోషల్ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమైనా స్వాతంత్రం కోసం పోరాటం చేశారా? లేకుండే రిపబ్లిక్ ఇండియా కోసం కృషిచేశారా? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజ్యాంగం రాయడానికి ఆ నాడు ఆయన తండ్రి రాజారెడ్డి, తరువాత రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ పోరాటం చేసినట్టున్నారు… అందుకే ఆ మహనీయుల చెంతనే చిత్రపటాలు పెట్టారు అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. తెలంగాణలో షర్మిళ పార్టీ పెట్టిన తరువాత నాన్న భజన పెరుగుతుందని అంతా భావించారు. కానీ అవేవీ లెక్క చేయకుండా మాటకు ముందో నాన్న.. వెనుకో నాన్న అని సంబోధించి తెలంగాణ ప్రజలకు ఒకరకంగా ఇబ్బందిపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మహనీయుల సరసన తండ్రిని చేర్చడంతో విమర్శలకు గురవుతున్నారు.