YS Vivekananda Daughter: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం రేగుతోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట సాధారణ మరణంగానే చూసినా తరువాత క్రమంలో ఇది హత్య కేసుగా మారడంతో చిక్కులు ఎదురవుతున్నాయి. సీబీఐ కేసు దర్యాప్తు చేస్తుండటంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దీంతో కడప జిల్లాలో కలకలం కలుగుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయాలను సైతం కీలక మలుపులు తిప్పుతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసులో వైసీపీ నేతలే ఉన్నట్లు తేలడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో పట్టు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. టీడీపీ నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో ప్రస్తుతం పచ్చపార్టీ నేతలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
మరోవైపు తన తండ్రి హత్యతో సంబంధం ఉన్న వారికి శిక్ష పడేలా చూడాలని వివేకా కుమార్తె సునీత ఆశ పడుతున్నారు. తన తండ్రిని పొట్టన పెట్టుకున్న వారికి తగిన శిక్ష పడేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ అంటేనే రగిలిపోతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను టీడీపీ తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: అయ్యో పాపం గౌతం సవాంగ్? బదిలీ చేయడంలో ఆంతర్యమేమిటో?
సునీతను టీడీపీలోకి ఆహ్వానించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే జిల్లాకు చెందిన ఓ నేతను ఆమె వద్దకు పంపించి తన మనసులోని మాట చెప్పమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకూడా టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. దీంతో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని బాబు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది వైసీపీకి మింగుడు పడటం లేదు. టీడీపీ కుట్రలను నిశితంగా గమనిస్తోంది. పార్టీకి నష్టం కలిగితే ఉపేక్షించేది లేదని చూస్తున్నట్లు చెబుతోంది. కానీ వివేకా హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లడంతో ఇక అన్ని పార్టీల్లో మార్పులు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీకి మాత్రం లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: మోడీ గురించి జగనే ఒప్పుకున్నాడు..వైసీపీని ఇరికించిన పార్థసారథి