https://oktelugu.com/

Mahesh Babu Character in SVP: ఆమె టచ్ తో మహేష్ బాబు పొగరు అణిచివేయబడిందా?

Mahesh Babu Character in SVP: స్టార్ హీరోల సినిమాల్లో కొన్ని ఫార్ములాలు ఉంటాయి. హీరో క్యారెక్ట‌ర్ చుట్టే అన్ని తిరుగుతుంటాయి. స‌న్ని వేశాలు గానీ.. ఇత‌ర పాత్ర‌లు గానీ, పాట‌లు ఇలా అన్నీ హీరో పాత్ర‌ను హైలెట్ చేసేలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు మ‌హేశ్ బాబు న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట మూవీ గురించి కూడా ఇలాంటి చ‌ర్చే న‌డుస్తోంది. ఆయ‌న పాత్ర ఎలా ఉంటుంది అనే ఆస‌క్తి అంద‌రిలోనూ పెరిగిపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్న‌డూ […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 19, 2022 / 12:14 PM IST
    Follow us on

    Mahesh Babu Character in SVP: స్టార్ హీరోల సినిమాల్లో కొన్ని ఫార్ములాలు ఉంటాయి. హీరో క్యారెక్ట‌ర్ చుట్టే అన్ని తిరుగుతుంటాయి. స‌న్ని వేశాలు గానీ.. ఇత‌ర పాత్ర‌లు గానీ, పాట‌లు ఇలా అన్నీ హీరో పాత్ర‌ను హైలెట్ చేసేలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు మ‌హేశ్ బాబు న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట మూవీ గురించి కూడా ఇలాంటి చ‌ర్చే న‌డుస్తోంది. ఆయ‌న పాత్ర ఎలా ఉంటుంది అనే ఆస‌క్తి అంద‌రిలోనూ పెరిగిపోతోంది.

    Mahesh Babu Character in SVP

    ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్న‌డూ చూడ‌ని స‌రికొత్త పాత్ర‌లో మ‌హేశ్ బాబు క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. పైగా డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం హీరో పాత్ర చుట్టూ క‌థ‌ను న‌డిపిస్తుంటాడు. మే 12న విడుద‌ల అవుతున్న ఈ మూవి ప్ర‌మోష‌న్స్ ను ఇప్ప‌టి నుంచే మొద‌లు పెడుతున్నారు. ఇందులో భాగంగా మొన్న వ‌చ్చిన ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ కళావతి సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది.

    Mahesh Babu Character in SVP

    Also Read: Mahesh Babu Sarkaru Vaari Paata: యాక్షన్ మోడ్ లో ఉన్న ‘సర్కారు వారి పాట’

    యూ ట్యూబ్ ట్రెండింగ్ 1లో దూసుకుపోతోంది. అయితే ఈ పాట‌లో కొన్ని లిరిక్స్ చూస్తుంటే.. మ‌హేశ్ బాబు పాత్ర ఎలా ఉంటుంద‌నేది అర్థం అవుతోంది. ర‌చయిత శ్రీరామ్ రాసిన ఈ పాట‌లో మ‌హేశ్ బాబు పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన‌ట్టు అనిపిస్తోంది. చాలా ర‌ఫ్ గా ఉండే కుర్రాడికి అమ్మాయి స్పర్శ త‌గిలితే అత‌నిలో వ‌చ్చే మార్పు నేప‌థ్యంలో ఈ పాట‌ను తీర్చిదిద్దిన‌ట్టు తెలుస్తోంది.

    అంటే మ‌హేశ్ బాబును ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సాఫ్ట్ కార్న‌ర్‌లో చూపిస్తే.. ఇందులో మాత్రం చాలా మాస్ వేరియంట్ లో చూపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. త‌న రూట్ లో చాలా డేరింగ్ గా వెళ్లే కుర్రాడికి అమ్మాయి వ‌ల వేస్తే ఎలాంటి మార్పులు వ‌స్తాయో చెప్పేశారు పాట‌లో. అంటే మ‌హేశ్‌ను గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని విధంగా చూస్తార‌ని తెలుస్తోంది.ఇక ట్రైల‌ర్ కూడా త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఉండ‌గానే.. త్రివిక్ర‌మ్ తో మ‌రో మూవీ చేస్తున్నారు మ‌హేశ్‌. ఆ సినిమాపై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి.

    Also Read: ల‌క్ష్మీ పార్వ‌తి కంటే ముందే ఆ హీరోయిన్‌ను రెండో పెండ్లి చేసుకోవాల‌నుకున్న ఎన్టీఆర్‌.. కానీ!

    Tags