TV9- YCP: ఏపీ సీఎం జగన్ రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. వాటిని ఊహించడం కూడా కష్టం. స్ట్రాటజికల్ గానే కాకుండా ఎదుటివారిని దెబ్బతీసేందుకు, బలహీనపరిచేందుకు రకరకాల వ్యూహాలు అమలు చేస్తుంటారు. అందులో భాగంగా మీడియాను సైతం ఓ పద్ధతి ప్రకారం వాడుకుంటారు. ఇప్పటికే తన చేతిలో సాక్షి మీడియా ఉంది. జగతి పబ్లికేషన్ పేరుతో సాక్షి పత్రికను, సాక్షి టీవీ ని నడుపుతున్నారు. ఒక్క తన సొంత మీడియాతో గట్టెక్కలేమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎలక్ట్రానిక్ మీడియా అగ్రగామి టీవీ9 ను తన వైపు తిప్పుకున్నారు.అందులో మెజారిటీ వాటాలను జగతి మీడియా దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం టీవీ9 లో రజనీకాంత్ రావ్ కీరోల్ ప్లే చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టిఆర్పి రేటింగ్ లో టీవీ9 టాప్ లో ఉంది. మీడియా పరంగా అంత విలువలు లేవు. వార్తల ప్రజెంటేషన్ పరంగా కూడా విలువలు పాటించిన దాఖలాలు లేవు. సోషల్ మీడియాలో విపరీతంగా తిట్లు తింటున్న ఛానల్ ఏదైనా ఉంది అంటే అది టీవీ9. కానీ టిఆర్పి రేటింగ్ లో మాత్రం ముందంజలో ఉంది. అదేదో మాయాజాలంలానే ఉంది. ప్రారంభించిన అనతి కాలంలోనే టీవీ9 తెలుగు నాట విశేష ప్రాచుర్యం పొందింది. మిగతా రాష్ట్రాలకు విస్తరించింది.
అయితే ఇప్పుడు అదే టీవీ9 ను అడ్డం పెట్టుకొని వైసిపి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. కానీ తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదరడంతో వైసీపీలో కలవరం రేగుతోంది. ఓటమి తప్పదని సర్వేలు ఒకవైపు తేల్చుతుండగా, మరోవైపు నిఘా వర్గాలు సైతం అవే హెచ్చరికలు పంపుతున్నాయి. దీంతో జగన్ శిబిరంలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో టీవీ9 రజనీకాంత్ రావు డిబేట్ ల ద్వారా ఆ రెండు పార్టీల పొత్తు మధ్య విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల భార్గవ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. వైసిపి ప్రభుత్వ విధానాలను గొప్పగా ప్రజెంటేషన్ చేస్తున్నారు. అదే సమయంలో టీవీ9 ద్వారా రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచడానికి ఒక సరికొత్త ప్లాన్ ను రూపొందించారు. ఇప్పటికే రజనీకాంతరావు డిబేట్ లలో ప్రో వైసిపి విధానం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీవీ9 రజినీకాంత్ రావు, సజ్జల భార్గవ్ రహస్య భేటీ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టిడిపి, జనసేనల మధ్య పొత్తును ఎలా విచ్ఛిన్నం చేయాలో వీరిద్దరూ చర్చిస్తున్నట్టు ఆ వీడియో సారాంశం. వీరితో పాటు రాజకీయ వ్యూహకర్త రిషిరాజ్ సింగ్ సైతం చర్చలు జరిపినట్లు బయటపడింది. వైసీపీకి హై క్రియేట్ చేసి,, టిడిపి, జనసేన మధ్య అగాధం సృష్టించడంతో పొత్తును విచ్ఛిన్నం చేయడంతో పాటు ఓట్లు, సీట్ల బదలాయింపు సక్రమంగా జరగకూడదు అన్నదే వీరి అభిమతం. అందుకే రజినీకాంత్ రావు డిబేట్లో కూర్చున్న ముందు వైసీపీ సోషల్ మీడియా, ఐపాక్ బృందం స్క్రిప్ట్ అందించడానికి ఇరువర్గాలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More