ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. శ్రావణి సుసైడ్ కి దారితీసిందా?

ప్రముఖ తెలుగు సీరియల్ నటి శ్రావణి రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దేవరాజ్.. సాయిలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ఆర్ఎక్స్-100 నిర్మాత అశోక్ రెడ్డి ఉన్నట్లు ఆరోపణలు వచ్చింది. దీంతో ఈ కేసులో అసలు నిజాలెంటో తెలుసుకునేందుకు తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also Read: డ్రగ్ కేసులో రకుల్ పేరు […]

Written By: NARESH, Updated On : September 13, 2020 4:50 pm
Follow us on

tv actor sravani

ప్రముఖ తెలుగు సీరియల్ నటి శ్రావణి రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దేవరాజ్.. సాయిలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ఆర్ఎక్స్-100 నిర్మాత అశోక్ రెడ్డి ఉన్నట్లు ఆరోపణలు వచ్చింది. దీంతో ఈ కేసులో అసలు నిజాలెంటో తెలుసుకునేందుకు తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: డ్రగ్ కేసులో రకుల్ పేరు వైరల్.. నవదీప్ కౌంటర్

ఈ కేసులో నిందితులుగా ఉన్న సాయి, దేవరాజ్ లు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే శ్రావణి.. సాయి.. దేవరాజ్ ల మధ్య జరిగిన సంభాషణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రావణి వీరిద్దరి క్లోజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాయి ఓ ఛానల్లో దేవరాజ్ అసలు బాగోతాన్ని బయటపెట్టాడు.

దేవరాజురెడ్డి వేధింపుల వల్ల శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని సాయి ఆరోపించాడు. టిక్ టాక్ ద్వారా దేవరాజ్ శ్రావణితో పరిచయం పెంచుకున్నాడని.. ఆ తర్వాత ప్రేమ పేరుతో మోసం చేశాడని తెలిపారు. శ్రావణిలాగానే ఎంతోమంది అమ్మాయిలను.. ఆంటీలను దేవరాజ్ ట్రాప్ చేసేవాడని సాయి చెప్పుకొచ్చాడు. దేవరాజ్ ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆర్ఎక్స్-100 నిర్మాతను కూడా ఇరిక్కించాడని సాయి ఆరోపించాడు. ఆయనకు ఈ కేసుతో సంబంధం లేదని స్పష్టం చేశాడు.

ఇక తానెప్పుడు శ్రావణిని వేధించలేదని తెలిపాడు. శ్రావణి తల్లిదండ్రులకు కూడా నేనంటే ఎంతో ఇష్టమని.. శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటో ఎప్పుడో చేసుకునే వాడనని చెప్పాడు. శ్రావణిని దేవరాజు వేధింపులకు గురిచేస్తుంటే వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పాడు. దేవరాజ్ అమ్మాయిలతో ఉన్న వీడియోలు, మాట్లాడిన ఆడియోలను శ్రావణే తనకు ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ కేసు విషయంతో తాను పోలీసులకు సహకరిస్తానంటూ చెప్పాడు.

Also Read: ఆడిషన్స్ నిర్వహించడంపై దేవరకొండ టీమ్‌ క్లారిఫికేషన్‌

అయితే శ్రావణి ఆత్మహత్యకు ముందే రోడ్డుపై సాయి.. శ్రావణి వాగ్వివాదానికి దిగడం సీసీ టీవీల్లో రికార్డు అయింది. సాయికి కౌంటర్ గా దేవరాజ్ సైతం పోలీసులకు సాక్ష్యాలు సమర్పించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి అసలు నిజాలను రాబట్టే పనిలో పడ్డారు. శ్రావణి కూడా వారిద్దరితో సన్నిహితంగా ఉండటం గమనార్హం. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరికీ శ్రావణి సుసైడ్ కు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో గంటకో ట్వీస్టు వెలుగు చూస్తుండటంతో అసలు నిజాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.