https://oktelugu.com/

‘రకుల్’ పెద్ద పత్తిత్తులా ఫీలైంది.. పాపాలు ఊరికేపోవు !

సినిమా హీరోయిన్స్ చుట్టూ ప్రస్తుతం డ్రగ్స్ కేసులు తిరుగుతున్నాయి. ఇప్పటికే రియా, రాగిణి, సంజన లాంటి హీరోయిన్ల జాతకాలు బయట పడ్డాయి. ఈజీ మనీ కోసం డ్రగ్స్ బాట పట్టి.. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు ఈ భామలు. అయితే ఈ డ్రగ్స్ కేసులు కలకలం ఒక్క బాలీవుడ్, శాండల్ వుడ్‌ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ప్రకంపనలను సృష్టిస్తోంది. నిజానికి ఆ మద్యే టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో సంచలనం సృష్టించిన […]

Written By:
  • admin
  • , Updated On : September 13, 2020 / 04:26 PM IST
    Follow us on


    సినిమా హీరోయిన్స్ చుట్టూ ప్రస్తుతం డ్రగ్స్ కేసులు తిరుగుతున్నాయి. ఇప్పటికే రియా, రాగిణి, సంజన లాంటి హీరోయిన్ల జాతకాలు బయట పడ్డాయి. ఈజీ మనీ కోసం డ్రగ్స్ బాట పట్టి.. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు ఈ భామలు. అయితే ఈ డ్రగ్స్ కేసులు కలకలం ఒక్క బాలీవుడ్, శాండల్ వుడ్‌ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ప్రకంపనలను సృష్టిస్తోంది. నిజానికి ఆ మద్యే టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో సంచలనం సృష్టించిన ఆ కేసులు ఆ తరువాత మరుగున పడిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు డ్రగ్ కేసుల పునాదులు కదిలేలా కనిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో రియా చక్రబర్తిని విచారించిన పోలీసులకు, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న కొంతమంది పేర్లు కూడా ఆ విచారణలో బయటకు వచ్చాయట. వారిలో రకుల్‌ ప్రీత్ సింగ్ తో పాటు మరో హీరోయిన్ కు కూడా డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నట్టు తెలుస్తోంది.

    Also Read:తండ్రీకొడుకులుగా మహేష్ బాబు..!

    ఇదే గనుక నిజం అయితే.. టాలీవుడ్ లో చాలామంది పేర్లు బయటపడే అవకాశం ఉంది. ఎప్పుడైతే రకుల్ ప్రీత్ సింగ్‌ పేరు బయటకు వచ్చిందో, అప్పటి నుండి మరికొంతమంది టాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. వీరిలో పెద్ద కుటుంబాల నుండి వచ్చిన సినీ వారసులు కూడా ఉన్నారనేది ప్రధాన టాక్. అందుకే వివాదాల నటి శ్రీరెడ్డి మళ్ళీ వివాదాల కామెంట్స్ ను వదిలింది. ఈ డ్రగ్ రూమర్స్ పై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘నేను ఈ డ్రగ్ మాఫియా గురించి ముందే చెప్పాను. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ తో పాటు డ్రగ్స్ వాడకం కూడా ఉందని నేను అప్పుడు మాట్టాడితే.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద పత్తిత్తులా అలాంటివి లేవని మీడియాలో చెప్పుకొచ్చింది. నా మాటలు అవాస్తవం అన్నట్లు ఆవిడగారు తెగ పేలారు అప్పుడు.

    Also Read: డ్రగ్ కేసులో రకుల్ పేరు వైరల్.. నవదీప్ కౌంటర్

    టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్, నటీనటులను కించపర్చడం వంటివి అస్సలు లేవని రకుల్ తో పాటు మంచు లక్ష్మీ కూడా రెచ్చిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళు ఏమి చెబుతారు. కర్మ ఏ ఒక్కరినీ వదిలిపెట్టదు అని అందుకే అంటారు. ఎప్పటికైనా మనం చేసిన పాపాలన్నీ కట్ట కట్టుకుని మనకే వస్తాయి. కర్మకి వారు వీరు అని తేడా ఏమి ఉండదు కదా. ఏదోక రకంగా పాపానికి శిక్ష అనుభవించాల్సిందే, అది డ్రగ్స్ కేసులో కావచ్చు.. కరోనా విషయంలో కావచ్చు. పాపాలు ఊరికేపోవు. నాకు రావాల్సిన చెడ్డ పేరు ఎలాగో వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అంటూ టాలీవుడ్ మీద, రకుల్ ప్రీత్‌ మీద తెగ ఫైర్ అయిపోయింది శ్రీరెడ్డి.