
ఎప్పుడూ స్మార్ట్ గా సరికొత్త స్టైలిష్ లుక్ లు, వస్త్రాధారణతో మెరిసే ప్రధాని మోడీ ఈ మధ్య మాసినగడ్డం.. ఒక రుషిలా భారీగా పెంచడానికి కారణమేంటి? అసలు మోడీ గడ్డం ఎందుకు తీయడం లేదు. దాని వెనుకున్న కథ ఏమిటీ? అంటూ సోషల్ మీడియాలో జనాలు ఒకటే ఆరాతీస్తున్నారు. కరోనా లాక్ డౌన్ లో గడ్డం తీసే బార్బర్లను దగ్గరకు రానీయడం లేదా? కరోనా అంటుతుందని వారిని దూరం పెట్టాడా? మోడీ గడ్డం ఎందుకు తీయడం లేదు మరీ.. ఇలా ఎన్నో ప్రశ్నలు మోడీ గడ్డం చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు కొత్త స్టైల్‌లో కనిపిస్తున్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే మోడీ గడ్డంతో ఉంటారు. ఆయన పూర్తిగా గడ్డం తీసేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ప్రధాని అయ్యాక కూడా అదే ఫాలో అవుతూ వస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గడ్డం, జుట్టు కత్తిరించలేదు. దాదాపు పది నెలలుగా ఆయన గడ్డం, జుట్టు కత్తిరించకపోవడానికి కారణం ఏంటో స్పష్టంగా తెలియరాలేదు. కరోనా టైం నుండి ఇప్పటి వరకు ప్రధాని మోడీ అడ్రెస్ చేసిన సమావేశాలు చూస్తే స్పష్టంగా కనిపిస్తుంటుంది. కానీ.. దీని వెనుక ఆంతర్యం ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బలమైన కారణం లేనిది అలా చేయరు. కానీ.. ఆ కారణం ఏమై ఉండొచ్చు అన్నది హాట్ టాపిక్ అయింది.
Also Read: నేడు కాంగ్రెస్ పార్టీ బర్త్‌డే.. రాహుల్ మాత్రం అమ్మమ్మ ఇంటికి..
నిజానికి కరోనా లాక్ డౌన్ సడలింపులు రాకముందు… అందరిలాగే ప్రధాని దగ్గర పనిచేసే వారు లేరేమోనంటూ జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. బార్బర్ ను కలవలేదేమో అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. నిజానికి ప్రధాని స్థాయి వ్యక్తి అంత చిన్న కారణంతో గడ్డం చేయకుండా ఉంటారా..? అన్నది కూడా కీలకమే.
అయితే.. ప్రధాని గడ్డం వెనుక రామమందిరం ఉందని ఉడుపి పెజావర పీఠాధిపతి స్వామి విశ్వప్రసన్న తీర్థ పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేశారని, పూర్తి చేసే బాధ్యతను కలిగి ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. స్వామి విశ్వప్రసన్నతీర్థ అయోధ్య రామమందిర ట్రస్ట్ బోర్డులోని సభ్యుడిగా ఉన్నారు. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి చరిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో సంకల్పం చేసుకుని కేశాలను తొలగించరని, మోదీ గడ్డం, జుట్టు కత్తిరించకపోవడానికి ఇదే కారణమై ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ‘ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయడమే కాకుండా.. దాని నిర్మాణానికి భరోసా ఇచ్చే పూర్తి బాధ్యత ప్రధాని మోదీ తీసుకున్నారు. ఆచారం ప్రకారం సహజంగా ప్రకారం ఏదైనా సంకల్పం చేసేటప్పుడు వారి జుట్టును కత్తిరించకూడదు. మోదీ (పొడవాటి) జుట్టుకు అది కారణం కావచ్చు’ అన్నారు.
Also Read: రెండో టెస్టుపై పట్టుబిగించిన..131 పరుగుల ఆధిక్యం
రామమందిర నిర్మాణ ప్రాజెక్టు మొత్తం పూర్తికావడానికి మూడున్నరేళ్లు పడుతుందని అంచనా వేశారు. ఆలయ నిర్మాణ ప్రాజెక్టు రూ.1,500 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశామని పేర్కొన్నారు. ఇందులో రూ.500 కోట్ల ఆలయం కోసం, మిగతా మొత్తంతో చుట్టుపక్కల ఇతర అభివృద్ధి పనులను నిర్వహిస్తామన్నారు. కాగా, విశిష్టాద్వైత సిద్ధాంత కర్త మద్వాచార్యులు నెలకొల్పిన ఎనిమిది మఠాల్లో పెజావర్ ఒకటి. విశ్వప్రసన్నతీర్థ కంటే ముందు ఈ పీఠాధిపతిగా ఉన్న స్వామి విశ్వేవ తీర్థను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, మాజీ సీఎం ఉమాభారతి తదితరులకు ఆధ్యాత్మిక గురువు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్