ఈతాకు ఇచ్చి తాటాకు దొబ్బడం అంటే ఇదేనేమో. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మరోసారి మొండిచేయి చూపించింది. విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వాల్తేర్ డివిజన్ ను ఒడిశాలోని రాయగడ్ డివిజన్ లో కలిపేసింది. విశాఖ రైల్వే జోన్ పనులు ప్రాథమికంగా ప్రారంభం కూడా కాలేదు. దీంతో విశాఖ రైల్వే డివిజన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాల్తేరును లాగేసుకుని రాయగఢ్ లో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి. కానీ విశాఖ రైల్వే జోన్ కు మాత్రం పైసా కేటాయించలేదు
మూడేళ్ల కిందటే వివాఖను రైల్వే జోన్ గా కేంద్రం ప్రకటించింది. అత్యంత లాభదాయకమైన వాల్తేర్ డివిజన్ ను మాత్రం రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్ లో కలిపారు. మరో ముక్కతో ఒడిశాలోని రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖ కేంద్రంగా ఈజోన్ ఉంటుంది. సరుకు రవాణాలో కీలకంగా ఉండే కోరాపుట్, కిరండోల్ లైన్లను రాయగఢ్ లోనే కలిపారు.
రాయగఢ్ డివిజన్ ఏర్పాటుకు సరైన వసతులు లేవు. అయినా కోట్లు ఖర్చు చేస్తూ పనులు నిర్వహిస్తోంది. రూ.40 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. డివిజన్ కేంద్ర కార్యాలయానికి భూకేటాయింపులు చేశారు. పనులు చకచకక సాగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాయగఢ్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. అయినా అధికారిక నిర్ణయం తీసుకోవడం లేదు. రాయగఢ్ డివిజన్ పనులు పూర్తయితే విశాఖ రైల్వే జోన్ సంగతి మరుస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.