
టాలీవుడ్ అగ్రహీరోల్లో పారితోషకం విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవట నందమూరి బాలయ్యకు.. మిగతా హీరోలు కోట్లు పారితోషకం తీసుకొని సినిమా హిట్ అయితే లాభాల్లో వాటాను ముందే రాసుకుంటారు. కానీ బాలయ్య మాత్రం నిర్మాతల ఫ్రెండ్లీ అని.. ఆయన అడ్వాన్స్ తీసుకొని పెద్దగా నిర్మాతలను ఇబ్బంది పెట్టరని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
అందుకే అగ్రహీరోల కంటే బాలయ్యతో సినిమాలు చేయడానికే నిర్మాతలు క్యూ కడుతున్నారట.. ఇప్పటికే దిల్ రాజ్ సహా మైత్రీ మూవీస్, సీ కళ్యాణ్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్,ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు బాలయ్యకు అడ్వాన్సులు ఇచ్చాయట.. దర్శకుడు, కథ సెట్ అయితే సినిమా పట్టాలెక్కేయడమే..
ఇప్పటికే వీరు కాకుండా మరో నలుగురు ఐదుగురు నిర్మాతలు కూడా బాలయ్యతో సినిమాలు చేయడానికి అడ్వాన్సులు పట్టుకొని తిరుగుతున్నారట.. కానీ ముందుగా ఈ ఐదారు సినిమాలు అయ్యాకే బాలయ్య ఫ్రీ అవుతాడని.. అప్పుడే తీసుకుంటానని వెనక్కి పంపిస్తున్నాడట..
బాలయ్యతో అడ్వాన్సులు ఇచ్చినా ఆయనకు కథ నచ్చితేనే సినిమా పట్టాలెక్కనుంది. కథ నచ్చితే సినిమా పారితోషకం తక్కువైనా బాలయ్య చేస్తాడట.. అందుకే మంచి కథ, కథనం ఉన్న నిర్మాతలు, దర్శకులు బాలయ్య వైపు చూస్తున్నట్టు తెలిసింది.