BJP and TRS over Singareni: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మరోమారు మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈసారి సింగరేణి బొగ్గుగనులను వేదిక చేసుకుంది. ఈ మధ్య సింగరేణిలోని నాలుగు బ్లాకులను ప్రైవేటీకరించేందుకు రంగం చేసుకోవడంతో టీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోంది. బీజేపీ నిర్ణయాన్ని తప్పు పడుతూ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాయడం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై బీజేపీ మండిపడుతోంది. కేటీఆర్ చర్యలను నిరసిస్తోంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే కేంద్రం బొగ్గుగనులను కూడా ప్రైవేటీకరించాలని చూడటంపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని వ్యాఖ్యానించారు దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి.
కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 62 వేల మంది కార్మికులుండగా ప్రస్తుతం 40 వేల మంది ఉన్నారని తెలుస్తోంది. కేసీఆర్ నిర్వాకం వల్ల వేల కోట్లు పక్కదారి పడుతున్నాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ విధానాలతోనే రాష్ట్రం అధోగతి పాలవుతోందని బీజేపీ వాదన. టీఆర్ఎస్ కూడా బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Is BJP Anti Dalit: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. మధ్యలో దళితులు
సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణ విషయంలో కేటీఆర్ కు ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు.కేంద్రం తన పని తాను చేసుకుంటుంది కానీ రాష్ట్రానికి ఏం అవసరం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒడిశాలో వేలం వేసిన బ్లాకులను తెలంగాణ ఎందుకు దక్కించుకుందని అడుగుతున్నారు. కేటీఆర్ కు ఎక్కడ పొద్దుపోక ఇవన్నీ తన భుజాలపై వేసుకున్నట్లు నటించడం కొత్తేమీ కాదని తెలుస్తోంది.
సింగరేణి ఉపాధి లభించే ఓ బంగారు బాతులాంటిది. దీన్ని ప్రైవేటీకరించడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.యువత ఉపాధిని దెబ్బతీసే కార్యక్రమాలకు స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. బీజేపీ తన ప్రయత్నాలు మానుకోవాలని హితవు చెబుతున్నారు. కానీ కేటీఆర్ పై బీజేపీ కూడా తనదైన శైలిలో స్పందిస్తోంది. మొత్తానికి సామాజిక మాధ్యమాల వేదికగా రెండు పార్టీలు తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: TRS, BJP: ఆన్ లైన్ లో టీఆర్ఎస్, బీజేపీ ట్రెండింగ్