https://oktelugu.com/

‘కరోనా’ ఘంటికలు.. మళ్లీ మోగుతాయా?

దేశంలో మళ్లీ కరోనా వైరస్ ఘంటికలు మోగబోతున్నాయా? దేశంలో డెల్టా వైరస్ విస్తృతి పెరగడం దేనికి సంకేతం? కొత్త కేసులు 40వేలకు పైగా వెలుగుచూస్తుండడంతో మళ్లీ థర్డ్ వేవ్ ఖాయం అన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందినే లక్షణమున్న కరోనా డెల్టా వేరియంట్ కారణంగా తాజా విజృంభణ నివురు గప్పిన నిప్పులా ఉంది. అలాగే దేశంలో పలు రాష్ట్రాల్లో ‘ఆర్ ఫ్యాక్టర్’ 1 దాటింది. అంటే ఒక వ్యక్తి నుంచి వైరస్ ఒకరికంటే ఎక్కువమందికి సోకుతుందని […]

Written By:
  • NARESH
  • , Updated On : August 7, 2021 / 02:47 PM IST
    Follow us on

    దేశంలో మళ్లీ కరోనా వైరస్ ఘంటికలు మోగబోతున్నాయా? దేశంలో డెల్టా వైరస్ విస్తృతి పెరగడం దేనికి సంకేతం? కొత్త కేసులు 40వేలకు పైగా వెలుగుచూస్తుండడంతో మళ్లీ థర్డ్ వేవ్ ఖాయం అన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.

    వేగంగా వ్యాప్తి చెందినే లక్షణమున్న కరోనా డెల్టా వేరియంట్ కారణంగా తాజా విజృంభణ నివురు గప్పిన నిప్పులా ఉంది. అలాగే దేశంలో పలు రాష్ట్రాల్లో ‘ఆర్ ఫ్యాక్టర్’ 1 దాటింది. అంటే ఒక వ్యక్తి నుంచి వైరస్ ఒకరికంటే ఎక్కువమందికి సోకుతుందని ఈ ఆర్ ఫ్యాక్టర్ సూచిస్తుంది. ఆర్ ఫ్యాక్టర్ 1 దాటడం అంటే దేశంలో కరోనా ఆందోళనకరంగా మారుతున్నట్లేనని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ ఫ్యాక్టర్ రేటు 1.01గా ఉంది.

    కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశంలో కరోనా ఆర్ ఫ్యాక్టర్ 1.4కి చేరింది. ఆ తర్వాత 0.7 శాతానికి తగ్గింది. మరోసారి థర్డ్ వేవ్ ముప్పు వేళ 1.01కి ఇది చేరడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళనగా ఉంది.

    దేశంలోని కనీసం పది రాష్ట్రాల్లో దేశ సగటు కంటే ఎక్కువగా నమోదవుతోంది. అత్యధికంగా మధ్యప్రదేశ్ లో ఆర్ ఫ్యాక్టర్ 1.34గా ఉంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్ 1.3, నాగాలాండ్ 1.09గా ఉంది. అత్యధిక కేసులు నమోదవుతున్న కేరళ రాష్ట్రంలో ఆర్ ఫ్యాక్టర్ 1.06 గా ఉండడం గమనార్హం.

    ఈరేటుతో దేశంలోని ఆస్పత్రుల్లో చేరిక, మరణాలు కోవిడ్ తీవ్రతను వెల్లడిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా 19వేల కేసులు కేరళలో.. మధ్యప్రదేశ్ లో కేవలం 18వేల కొత్త కేసులు మాత్రమే నమోదు కావడం విశేషం.