YS Viveka Murder Case
YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వారం రోజుల్లో సంచలనాలు నమోదుకాబోతున్నాయా? ఇప్పుడిదే పొలిటికల్ సర్కిల్ లో చర్చగా మారుతోంది. అరెస్టులు ఊపందుకోవడంతో ఇక ‘కీ’లక వ్యక్తులను సైతం అదుపులో తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ఇన్నాళ్లు సీబీఐతో ఆడుకున్న వారికి.. ఇప్పుడదే సీబీఐ చుక్కలు చూపిస్తోంది. కేసు విచారణ సమయంలో పులివెందులలో దర్యాప్తు అధికారును భయపెట్టడం, వారిపై కేసులు పెట్టడం రాజకీయ ఒత్తిళ్లతో సీబీఐ బాధిత వర్గంగా నిలబడిందన్న టాక్ ఉంది. వీలైనంత వరకూ దర్యాప్తును ఆలస్యం చేయడంలో సైతం విజయం సాధించారు. చివరకు దర్యాప్తు అధికారిని సైతం మార్చగలిగారు. దీంతో ఇక తాము బయటపడినట్టేనని రిలాక్స్ అయ్యారు. ఇంతలోనే సీన్ మారిపోయింది. పాత్రధారులు, సూత్రధారులు పేర్లు బయటపడే చాన్స్ ఉంది. అసలు సిసలు దర్యాప్తు ఇప్పుడే సాగుతోందని.. వారం పదిరోజుల్లో కీలక వ్యక్తుల పేర్లు బయటకు రానున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.
రెండు వారాల్లో మారిన పరిణామాలు
ఆది నుంచి కేసులో ట్విస్టు కొనసాగుతోంది. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి చుట్టూనే కేసు నడుస్తోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి రెండుసార్లు సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. దీంతో ఆయన ఆందోళనకు గురయ్యారు. సీబీఐ దూకుడును తగ్గించడంతో పాటు ముందస్తు బెయిల్ కు అప్లయ్ చేసుకున్నారు. అయితే సీబీఐ సిట్ మారడంతో ఇక తాను డేంజర్ జోన్లలో లేనంటూ ఆయనలో ధీమా కనిపించింది. వెంటనే తెలంగాణ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఇక తనకు ముప్పు ఉండదని భావించడంతోనే ఉపసంహరించుకున్నారు. దాదాపు రెండు వారాల పాటు రిలాక్స్ గా ఉన్నారు. కానీ అనూహ్యంగా సీబీఐ వరుస అరెస్టులతో హీట్ పుట్టిస్తోంది. సీబీఐ కొత్త టీమ్ ఇంత వేగంగా స్పందిస్తుందని అవినాష్ రెడ్డి అండ్ కో అస్సలు ఊహించలేదు. తాజా పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది.
అత్యున్నత అధికారులతో టీమ్..
వాస్తవానికి వివేకానందరెడ్డి హత్యకేసును ఛేదించడానికి ఇంత సమయం అవసరమా? ఒక హత్యకేసును రెండు, మూడు రోజుల్లో ఏపీ పోలీసులు ఛేదిస్తున్నారు. మిస్టరీని సైతం త్వరిగతిన చిక్కుముడి విప్పి మరీ తేల్చేస్తున్నారు. అటువంటిది ప్రస్తుత సీఎం బాబాయ్, మాజీ సీఎం సోదరుడు హత్యకేసును సీబీఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ తేల్చలేదంటే అందులో రాజకీయ లాబీయింగ్, అదృశ్య శక్తులు ఏ స్థాయిలో పనిచేశాయో అర్ధం చేసుకోవచ్చు. కానీ సీబీఐ పై ఎటువంటి ఒత్తిడి లేకుంటే ఈపాటికే ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎప్పుడో బయటకు వచ్చేవారు. సీబీఐలో రాంసింగ్ ఎస్పీ స్థాయి అధికారే. ఆయన దూకుడుకే అనుమానితులు, నిందితులు తట్టుకోలేకపోయారు.అటువంటిది అత్యున్నత టీమ్ ను న్యాయస్థానం ఏర్పాటుచేసింది. ఈ నెల 310లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించింది. అయితే దర్యాప్తు అధికారిని మార్చేశామని సంబరాలు చేసుకున్న అవినాష్ రెడ్డి అండ్ కోకు కొత్త టీమ్ చుక్కలు చూపిస్తోంది.
Ramoji Rao
రామోజీని ఇబ్బంది పెట్టవద్దన్న పెద్దలు..
వివేకా కేసులో సీబీఐ దూకుడు పెంచిన ప్రతిసారి ఢిల్లీ వెళ్లి కామ్ చేసేవారు. తరువాత పరిణామాలు సైతం సద్దుమణిగేవి. అయితే ఇటీవల జగన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీనికి రామోజీరావు ఎపిసోడే కారణమని తెలుస్తోంది. రామోజీ రావుకు ఢిల్లీ పెద్దల వద్ద మంచి గౌరవమే ఉంది. ఆ గౌరవంతోనే రామోజీరావును ఇబ్బంది పెట్టొద్దని జగన్ కు కేంద్ర పెద్దలు సూచించారు. కానీ ఆయన పెడచెవిన పెట్టారు. దీంతో కేంద్ర పెద్దలు కూడా జగన్ ను పట్టించుకోవడం మానేశారు. అందుకే వివేకా హత్య కేసు పట్టుబిగుస్తోందన్న టాక్ నడుస్తోంది. అందుకే జగన్ సైతం ఢిల్లీ పెద్దల ద్వారా కాకుండా వేరే మార్గాల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. అయితే మునుపెన్నడూ లేని ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖంలో కళ సైతం తగ్గింది. ఎటువంటి సంచలనాలు నమోదవుతాయోనన్న బెంగ వెంటాడుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Is the ramoji rao episode the reason for the cbis aggression in the ys vivekananda reddy murder case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com