https://oktelugu.com/

TRS: టీఆర్ఎస్ లో కోవర్టులపై చర్యలకు పార్టీ సిద్ధమవుతోందా?

TRS: టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు తన విశ్వాసం కోల్పోతోంది. దీంతో ఉనికి ప్రమాదంలో పడిపోతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు పోలైనట్లు గుర్తించింది. దీని కోసం పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాల తరువాత పార్టీలో ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. పార్టీ బలోపేతంపై సమాలోచనలు చేసేందుకు సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి చెందిన నేతలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుపై సందేహాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 13, 2021 / 12:39 PM IST
    Follow us on

    TRS: టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు తన విశ్వాసం కోల్పోతోంది. దీంతో ఉనికి ప్రమాదంలో పడిపోతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు పోలైనట్లు గుర్తించింది. దీని కోసం పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాల తరువాత పార్టీలో ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. పార్టీ బలోపేతంపై సమాలోచనలు చేసేందుకు సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి చెందిన నేతలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుపై సందేహాలు వస్తున్నాయి.

    TRS

    రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో ఉన్న కోవర్టులను ఏరివేసేందుకే పూనుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అసంతృప్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నట్లు సమాచారం. ఇలా వారి సంఖ్య రెట్టింపైతే పార్టీ భవిష్యత్ కే మచ్చ వచ్చే అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే పార్టీ అధినేత పార్టీ బంగారు భవిష్యత్ కోసం పలు వ్యూహాలు తీసుకోనున్నట్లు సమాచారం.

    పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ ఆదేశాలు ధిక్కరించి క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు ఫలితాల వెల్లడి తరువాత పార్టీలో సమూల మార్పులు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. పార్టీలో కూడా నేతల్లో ఆగ్రహం పెరిగిపోతోంది. వారికి ఎలాంటి నిధులు రాకపోవడంతో తాము ఎందుకు గెలిచామనే అనుమానాలు వస్తున్నాయి. చేసిన పనులకు సైతం బిల్లులు రాకపోవడంతో అప్పులపాలవుతున్నామని బెంగతో ఉన్నారు. దీంతోనే క్రాస్ ఓటింగ్ కు సై అని ఎంతో కొంత డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

    రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రభావం పడే అవకాశం ఏర్పడింది. దీంతోనే పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరుుతోంది. పార్టీలో ఎంతమంది పార్టీ ఆదేశాలను ధిక్కరించారనే దానిపై లెక్కలు వేస్తోంది. దీంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భవిష్యత్ లో పార్టీకి చేటు చేసే వారికి శిక్షలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Etela Rajender: ఈటలను హగ్ చేసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నేతలు, సాదర స్వాగతాలు.. ఏం జరుగుతోంది.?

    పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది. దీని కోసమే చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అధినేత కేసీఆర్ ఇప్పటికే దీనిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. కోవర్టులను క్షమించేది లేదని చెబుతున్నారని తెలుస్తోంది. ఇందుకు గాను జాబితా సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.

    Also Read: Martyrs Stupa: అమరవీరుల స్తూపం ఆంధ్రా కాంట్రాక్టర్ తో నిర్మించడంలో ఆంతర్యమేమిటి?

    Tags