Chandrababu Kuppam Tour: కుప్పం ఘటన వ్యూహాత్మకమా ? అటెన్షన్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడా ? కుప్పం ఘటన పై పోలీసుల వివరణ చూస్తే నమ్మక తప్పని నిజమని అనిపిస్తోంది. సరైన ఫార్మాట్ లో అనుమతులు కోరనందున.. మరోసారి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు టీడీపీ నేతలకు సూచించినట్టు పోలీసులు చెబుతున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలు రాంగ్ ఫార్మాట్ లో దరఖాస్తు చేశారని, పోలీసులకు సహకరించలేదని అర్థమవుతోంది. ఇదంతా చంద్రబాబు వ్యూహరచనే అని వైసీపీ అంటోంది.

కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. రద్దీ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమనేది ఆ జీవో సారాంశం. కానీ కుప్పం పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు సరైన ఫార్మాట్ లో దరఖాస్తు చేసుకోలేదని ఏపీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు నిషేధించడం అబద్ధమని ఆయన వెల్లడించారు. సరైన ఫార్మాట్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన టీడీపీ నేతలు పెడచెవిన పెట్టారని ఆరోపించారు. పోలీసుల ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదని, సరైన స్పందన టీడీపీ నేతల నుంచి రాలేదని రవిశంకర్ తెలిపారు.
పోలీసుల ప్రకటన చూస్తే కుప్పం ఘటనకు చంద్రబాబు వ్యూహమే కారణమనిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా తనను చూసి ప్రభుత్వం భయపడుతోందన్న కలరింగ్ ఇచ్చుకోవడానికే ఆయన ఈ స్ట్రాటజీ అమలు చేశారని తెలుస్తోంది. మామూలుగా, సాఫీగా పర్యటన సాగితే అందులో కిక్కేముంది అనుకున్నారో ఏమో, కుప్పంలో నానా యాగీ చేశారు. పాదయాత్రగా వెళ్లారు. బస్సెక్కి ప్రసంగించారు. తాను వృద్ధుడిని కాదు నవయువకుడని కలరింగ్ ఇచ్చుకోవడానికి బస్సే ఎక్కేశారు. కుప్పం ఘటన చూస్తే పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు తెలుస్తోంది.

ఎన్నికలకు ముందే రాష్ట్రంలో హీట్ పెంచేందుకు చంద్రబాబు నాయుడు నానా అగచాట్లు పడుతున్నాడు. కందుకూరు, గుంటూరు ఘటనలతో మిన్నుకుండిపోయి.. కుప్పం ఘటనలో రెచ్చిపోయారు. పోలీసుల తీరు పై విరుచుకుపడటంతో .. వాస్తవాలు ఇవే అంటూ పోలీసులు మీడియాకెక్కారు. దీంతో అసలు నిజం బయటపడిందని అధికార పార్టీ నేతలు అంటున్నారు.