M. M. Keeravani: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. భారతీయ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు జ్యూరీ సభ్యులు నాటు నాటు సాంగ్ ని ఎంపిక చేశారు. లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేదికపై ఇండియన్ మూవీ సత్తా చాటింది. నాటు నాటు సాంగ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు. ఆయన రెండు నిమిషాలకు పైగా ప్రసంగించారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి నాటు నాటు సాంగ్ ని ఎంపిక చేసిన హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అస్సోసియేషన్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు అందుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ గ్రేట్ మూమెంట్ భార్య శ్రీవల్లితో సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు కీరవాణి చెప్పారు. ఈ అవార్డు నిజంగా ఎవరికి చెందుతుందో, కారకులు ఎవరో ప్రయారిటీ వైజ్ చెప్పుకొచ్చారు. అందరూ ఊహించినట్లే ఈ అవార్డు అందుకోవడం వెనుక దర్శకుడు రాజమౌళి ఉన్నారని, ఇది ఆయనకే చెందాలని కీరవాణి అన్నారు.
నా తమ్ముడు, ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు రాజమౌళికి ఈ విజయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానన్నారు. అనంతరం కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ కి క్రెడిట్ ఇచ్చారు. అలాగే సాంగ్ కి పని చేసిన కొడుకు కాల భైరవ పేరు ప్రస్తావించారు. సాహిత్యం అందించిన చంద్రబోస్, సాంగ్ పాడిన రాహుల్ సిప్లి గంజ్ కూడా ఈ విజయానికి కారకులు అన్నారు. ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పేరు కూడా ప్రస్తావించారు. వారికి క్రెడిట్ ఇచ్చారు.

అయితే సినిమా నిర్మాణంలో ప్రధాన పిల్లర్ అయిన నిర్మాత పేరు ఆయన ప్రస్తావించలేదు. గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక వేదిక మీద డివివి దానయ్య ప్రస్తావించలేదు. చివరికి నాటు నాటు సాంగ్ ప్రోగ్రామర్స్ పేర్లు కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. 24 క్రాఫ్ట్స్ ఒక చోటికి చేర్చి, వారందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాను సిల్వర్ పైకి తెచ్చే నిర్మాతను మర్చిపోవడం దారుణ పరిణామం. కావాలనే దానయ్యను పేరు చెప్పలేదనే మాట వినిపిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఇంటర్నేషనల్ ఫేమ్ అనుభవిస్తున్న రాజమౌళి సైతం ఏనాడూ దానయ్యకి క్రెడిట్ ఇచ్చిన దాఖలాలు లేవు.
MM Keeravaani’s #GoldenGlobes2023 acceptance Speech!! ❤️🔥❤️🔥 #RRRMovie #NaatuNaatu pic.twitter.com/9q7DY7Pn5G
— RRR Movie (@RRRMovie) January 11, 2023