https://oktelugu.com/

గ్రేటర్ వార్ కూడా బీజేపీ-టీఆర్ఎస్ మధ్యేనా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటీ?

గ్రేటర్ ఎన్నికలకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. గ్రేటర్ నోటిఫికేషన్ కంటే ముందుగానే టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. టీఆర్ఎస్ ముందస్తు ప్రచారంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అలర్ట్ అయి ప్రచారం మొదలెట్టాయి. Also Read: లెక్కలివీ: టీఆర్ఎస్ కే మేయర్ పీఠం? తాజాగా గ్రేటర్ నోటిఫికేషన్ విడుదల కావడంతో మహానగరంలో ఎన్నికల సందడి మొదలైంది. ఇటీవల దుబ్బాక జరిగిన ఎన్నికలో బీజేపీ.. టీఆర్ఎస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 02:48 PM IST
    Follow us on

    గ్రేటర్ ఎన్నికలకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. గ్రేటర్ నోటిఫికేషన్ కంటే ముందుగానే టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. టీఆర్ఎస్ ముందస్తు ప్రచారంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అలర్ట్ అయి ప్రచారం మొదలెట్టాయి.

    Also Read: లెక్కలివీ: టీఆర్ఎస్ కే మేయర్ పీఠం?

    తాజాగా గ్రేటర్ నోటిఫికేషన్ విడుదల కావడంతో మహానగరంలో ఎన్నికల సందడి మొదలైంది. ఇటీవల దుబ్బాక జరిగిన ఎన్నికలో బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లు సాగింది. హోరాహోరీగా సాగిన పోరులో విజయం మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావుకే దక్కింది. ఈ విజయం బీజేపీకి కొండంత బలాన్ని ఇవ్వగా.. టీఆర్ఎస్ మాత్రం షాకిచ్చింది.

    దుబ్బాక ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడకుండా ఉండేందుకే టీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటి సీఎం కేసీఆర్ కు మరోసారి షాకివ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈక్రమంలోనే బీజేపీ-జనసేన పార్టీలు కలిసి జీహెచ్ఎంసీలో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది.

    బీజేపీకి నగరంపై పూర్తి పట్టుండటం.. జనసేనతో పొత్తు.. దుబ్బాక ఎన్నికల్లో గెలుపు అంశాలు ఆపార్టీకి కలిసి రానున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుండటంతో ఆపార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ కు చెందిన పలువురు ముఖ్య నేతలు పెద్దఎత్తున బీజేపీలో చేరుతున్నారు.

    Also Read: భక్తులకు అలర్ట్.. కరోనా నెగటివ్ వస్తేనే పుష్కరాలకు అనుమతి..?

    ఇప్పటికే కొప్పుల నరసింహా రెడ్డి బీజెపిలో చేరగా నేడు ఫతేనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దాపురం కృష్ణ గౌడ్ , మాజీ మేయర్ బండ కార్తీక బీజేపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ రవి కుమార్ యాదవ్, బిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.

    ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆశావహులంతా కమలం వైపు చూస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీలోనూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్