Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మారుతుందని అంతా భావించినా ఏం మార్పు కనిపించడం లేదు. దీంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లు పార్టీని గాడిలోపెడతారని అనుకున్నా ఆ దిశగాప్రయత్నాలు సాగడం లేదు. రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి మద్దతు లభించడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. రాష్ర్టంలో పార్టీని ముందుకు నడిపించే సత్తా కనిపించడం లేదు. ఫలితంగా పార్టీ గురించి ప్రజలు కూడా మరిచిపోతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం మాట దేవుడెరుగు ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా చేపట్టాలని భావించింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో నాయకులకు దిశా నిర్దేశం చేసింది. కానీ అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు. చాలా చోట్ల నాయకుల నిర్లక్ష్యంతో అసలు కార్యక్రమం ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు సీరియస్ గానే ఉన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లని నేతలపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. కానీ నాయకత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ల అవకాశాలే కనిపించడం లేదు.చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఉన్న సంగతి కూడా క్రమంగా మరిచిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోపార్టీని ఎలా గట్టెక్కిస్తారు అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: KCR Social Media: కేసీఆర్ ను నిజంగానే సోషల్ మీడియా అంత కలవరపెడుతోందా?
మరోవైపు రాష్ర్టంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది. అందుకు అనుగుణంగానే విజయాలు సాధిస్తోంది. దీంతో కాంగ్రెస్ ను లెక్కలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ మధ్యే ఆధిపత్య పోరు సాగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత బీజేపీలో జోష్ పెరిగింది. దీంతో టీఆర్ఎస్ కూడా బీజేపీనే తమ శత్రువుగా భావిస్తోంది. అందుకే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా కూడా బీజేపీనే టార్గెట్ చేస్తోంది టీఆర్ఎస్. అందుకే కాంగ్రెస్ పార్టీని అసలు గుర్తించడం లేదు. ఇలాగే కొంత కాలం ఉంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరిన్ని కష్టాలు వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు సహకరించేందుకు ఎవరు సిద్ధంగా లేరు. దీంతోనే పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు కదలడం లేదు. సీనియర్ల తీరుతో పార్టీ అగాధంలో పడిపోతోంది. రాష్ర్టంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ గా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం విచారకరం. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులు కూడా కరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రేవంత్ ఏం చర్యలు తీసుకున్నా అవి ముందుకు సాగడం లేదు. నేతల తీరుతోనే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది.
Also Read: KCR vs BJP: బీజేపీపై కేసీఆర్ ఎందుకు బరెస్ట్ అయ్యాడు?