Chandrababu-Pawan Kalyan: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉన్నప్పటికీ రాజకీయ క్షేత్రంలో టీడీపీ ఉంది. ఏపీ అసెంబ్లీ పరిణామాల నేపథ్యంలో తాను సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేశారు. కాగా, తాజాగా అధికార వైసీపీని ఎదుర్కొనేందుకుగాను ప్రతిపక్షాలుకలిసి రావాలని, రాజకీయాల్లో వన్ సైడ్ లవ్ వల్ల ప్రయోజనం లేదని అన్నారు.

ఓ టీడీపీ కార్యకర్త నుంచి జనసేనతో పొత్తు విషయమై ప్రస్తావన రాగా, చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో తాను జనసేనతో పొత్తుకు సిద్ధంగానేని పరోక్ష అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన సీనియర్ నేత బొలిశెట్టి స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బేషరతు మద్దతు ఇవ్వాలని చాలెంజ్ చేశారు. ఈ సంగతులు అలా ఉంచితే చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మాత్రం ఎందుకో స్పందిచండం లేదు. అలా పవన్ కల్యాణ్ స్పందించుకుండగా సైలెంట్‌గా ఉండటం వెనుక కారణమేంటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Also Read: ధరలు, జగన్.. చంద్రబాబు కొత్త విధానం గురించి తెలుసా?
నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసింది. కానీ, అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. గెలిచిన ఒక్క సీటు కూడా చివరకు వైసీపీ మద్దతుగా మారిపోయింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదగాలని జనసేన భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే బీజేపీతో పొత్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత పొత్తు గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్ మాత్రం స్పందించడం లేదు.
గతంలో చంద్రబాబుకు మద్దతు ఇచ్చి పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అయ్యారని అప్పట్లో రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. కాగా, ఈ సారి మాత్రం అలా పొత్తులో ఉండకుండా సొంతంగానే తన బలం పెంచుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని పలువురు అంచనా వేస్తున్నారు. అందుకే బీజేపీతో పొత్తులో ఉన్నా.. తనకు తానుగా ఎదగాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే టీడీపీ ఆఫర్ పైన పవన్ కల్యాణ్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.
[…] Also Read: చంద్రబాబు ‘ప్రేమ’ ఆఫర్‌పై పవన్ కల్యా… […]