Etela Rajender: తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. నేతల మధ్య పోటీ వాతావరణం పెరుగుతోంది. దీంతో ఒకరిపై మరొకరు పోటీకి సై అంటే సై అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద దుమారమే రేగుతోంది. రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. మధ్యలో కాంగ్రెస్ ను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ పలుమార్లు ప్రకటిస్తూనే ఉంది. దీంతో బీజేపీని ఎలా ఎదుర్కోవాలని టీఆర్ఎస్ కూడా వ్యహాలు రచిస్తోంది.

బీజేపీలో చేరి కీలక నేతగా ఎదిగిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాను కేసీఆర్ పై పోటీకి రెడీ అని ప్రకటించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో భయం పట్టుకుంది. ఒకవేళ ఈటల ఇక్కడ నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఏంటని అందరిలో ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే హుజురాబాద్ లో చావు తప్పి కన్ను లొట్టబోయిన టీఆర్ఎస్ కు ఇప్పుడు ఈటల సవాలు మింగుడు పడటం లేదు. టీఆర్ఎస్ ను ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ నేతలు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కేంద్రం కూడా దీనికి అండగానే నిలుస్తోంది.
Also Read: Pawan Kalyan: పంథా మార్చుకున్న జనసేనాని… సరైన వ్యూహంతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్
పలుమార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కే ఉందని ప్రకటించడంతో టీఆర్ఎస్ లో భయం కలుగుతోంది. బీజేపీ అన్నంత పని చేస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఎందుకంటే బీజేపీకి ఉన్న బలంతో టీఆర్ఎస్ ను ఈజీగా ఢీకొంటుందనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ కు మింగుడు పడటం లేదు. బీజేపీ రోజురోజుకు తనకు పక్కలో బల్లెంలా మారుతుందని తల పట్టుకుంటున్నారు. మరోవైపు సర్వేలు కూడా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడంతో టీఆర్ఎస్ కు కాలం చెల్లిందనే నివేదికలు చూపిస్తున్నాయి.

ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీ చేసినా హుజురాబాద్ లో తన భార్య జమునకు టికెట్ ఇప్పించి తద్వారా అక్కడి సీటు కూడా పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అదే ధీమాతోనే సీఎంపై పోటీకి సై అంటూ ఈటల ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీకి ఏం తోచడం లేదు. కేంద్రంపై అనవసర ప్రేలాపణలు చేస్తున్న టీఆర్ఎస్ కు ఘోరీ కట్టడం ఖాయమనే వాదన కూడా వస్తోంది. దీంతోనే బీజేపీ పన్నుతున్న ఎత్తుల్లో టీఆర్ఎస్ చిత్తు కావడం తథ్యమనే విషయం తెలుస్తోంది.
దీంతో రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి తిప్పలు తప్పవని తెలుస్తోంది. రాజకీయ ఎత్తుల్లో భాగంగా బీజేపీ, టీఆర్ఎస్ ఇంకా ఎన్ని పాట్లు పడతాయో అంతు చిక్కడం లేదు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఎన్ని మార్పులు వస్తాయో కూడా అర్థం కావడం లేదు. బీజేపీ వేసిన సవాలుకు టీఆర్ఎస్ మాత్రం ఇంతవరకు సమాధానం చెప్పకపోవడం గమనార్హం.
Also Read:MP Arvind- CM KCR కేసీఆర్ కు భయపడిపోతున్న ఎంపీ అరవింద్.. సంచలన నిర్ణయం