Tamannaah Bhatia: నాలుగేళ్ల క్రితం వరకూ ‘తమన్నా’ క్రేజీ హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉంది. ఇప్పుడు ఫేడ్ అవుట్ హీరోయిన్. అవును, ఆమె సినీ కెరీర్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. పైగా ‘తమన్నా’ పెళ్లి పీటలు ఎక్కడానికి ఆసక్తిగా ఉంది. మరోపక్క సినిమాలు కూడా తగ్గాయి. పాపం ఈ మధ్య ‘తమన్నా’ ఎన్ని హాట్ ఫోటో షూట్ లతో హడావిడి చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. విచిత్రంగా ఆమె ఫాలోవర్స్ కూడా ‘తమన్నా’ ఫోటోల పై పెద్దగా స్పందించడం లేదు.

అయినా వెనక్కి తగ్గకుండా నేను కూడా లైమ్ లైట్ లోనే ఉన్నానంటూ ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోజులతో ‘తమన్నా’ రెచ్చిపోతుంది. అయినా ఏ డైరెక్టర్ అమ్మడుకు ఛాన్స్ ఇవ్వడం లేదు. నిజానికి, ‘తమన్నా’ ఎన్నో ఆశలతో బాలీవుడ్ కి వెళ్ళింది. తన ఒంపు సొంపులతో ఒక ఊపు ఉపాలనుకుంది. కానీ, ఏ మాత్రం ‘తమన్నా’ కి కాలం కలిసి రాలేదు అక్కడ.
Also Read: Liger Trailer: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ పై క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కే
అసలు తనకే ఎందుకు బొత్తిగా కలిసి రావడం లేదు అంటూ ఆ మధ్య ఓ స్వామిని కూడా నమ్ముకుంది. కానీ, ఆ స్వామి కూడా ‘తమన్నా’ను కష్టాల కడలి నుంచి బయట పడేయలేకపోయాడు. దీంతో, ఇక లాభం లేదనుకుని ‘తమన్నా’ సైడ్ బిజినెస్ మొదలు పెట్టిందని టాక్ మొదలైపోయింది. నిజానికి ‘తమన్నా’ ముంబై చైన్ రెస్టారెంట్లు, బేకరీలు మొదలు పెట్టే ఆలోచనలో ఉందని ఆ మధ్య వార్తలు బాగా వచ్చాయి.

అయితే తాజాగా మరో వార్త వినిపిస్తోంది. తమన్నా నిర్మాణంలోకి దిగబోతుంది. ఓటీటీల కోసం రెండు వెబ్ సిరీస్ లు నిర్మించే ఆలోచనలో ఉంది. పైగా ఆ సిరీస్ ల్లో మెయిన్ లీడ్ తానే. ఛాన్స్ లు లేకపోతే ఏమి, తానే ఛాన్స్ ను క్రియేట్ చేసుకుంటుంది తమన్నా . తన సినిమాలు ఫెయిలైన తర్వాత చాన్నాళ్లు డిప్రెషన్ తో మగ్గిపోయిన తమన్నా ఈ మధ్య చాలా మారిపోయింది.
వినూత్నంగా ఆలోచించడం మొదలు పెట్టింది. పైగా తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ.. కొత్త అవకాశాల కోసం నిత్యం స్టార్ దర్శకనిర్మాతలతో టచ్ లో ఉంటుంది. కానీ, ఆమెకు మాత్రం ఏ స్టార్ దర్శకుడు, ఏ నిర్మాత ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. అయినా తమన్నా మాత్రం వచ్చిన చిన్నాచితకా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటూ ముందుకుపోతుంది.