https://oktelugu.com/

Janhvi Kapoor: సీత ‘రామాయణం’లో జాన్వీ కపూర్.. మరీ కంగనా పరిస్థితి ఏమిటి ?

Janhvi Kapoor: ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ‘రామాయణం’ కథని సీత పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్క్రిప్ట్ రాశారు. ‘సీత’ అనే ఈ పౌరాణిక కథతో ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. మొదట ‘సీత’ పాత్రలో కరీనా కపూర్ ఐతే బాగుంటుంది అనుకున్నా.. ఆ తర్వాత దర్శక, నిర్మాతలు కంగనా రనౌత్ ను ఖరారు చేసుకున్నారు. కంగనా కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి […]

Written By:
  • Shiva
  • , Updated On : July 19, 2022 / 05:07 PM IST
    Follow us on

    Janhvi Kapoor: ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ‘రామాయణం’ కథని సీత పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్క్రిప్ట్ రాశారు. ‘సీత’ అనే ఈ పౌరాణిక కథతో ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. మొదట ‘సీత’ పాత్రలో కరీనా కపూర్ ఐతే బాగుంటుంది అనుకున్నా.. ఆ తర్వాత దర్శక, నిర్మాతలు కంగనా రనౌత్ ను ఖరారు చేసుకున్నారు. కంగనా కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంది.

    Janhvi Kapoor

    అయితే, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నిర్మాతలు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ.. రెమ్యునరేషన్ లను కూడా ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో కంగనాకి దాదాపు 7 కోట్లు వరకు కేటాయించారు. అయితే, కంగనా మాత్రం తనకు 13 కోట్లు కావాలంటూ డిమాండ్ చేసింది. కంగనా రనౌత్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ కాదు కదా, ఆమెకు ఈ మధ్య వరుస ప్లాప్స్ వస్తున్నాయి.

    Also Read: Rashmika Mandanna- Shraddha Kapoor: రష్మిక మందన్నాతో పాటు శ్రద్ధా కపూర్ కూడా రెడీ.. తెలుగు డైరెక్టర్ క్రేజీ ప్లాన్

    అలాంటి కంగనా రనౌత్ 13 కోట్లు డిమాండ్ చేయడం ఏమిటి అంటూ షాక్ అయ్యారు నిర్మాతలు. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. దాంతో, కంగనా రనౌత్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తూ.. ‘సీత’ పాత్రలో నటించే అవకాశం వస్తే.. కళ్ళు మూసుకొని ఒప్పుకోవాలి గానీ, అంత కావాలి, ఇంత కావాలి అని డిమాండ్స్ చేయడం ఏంటి ?’ అంటూ కంగనా రనౌత్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు.

    Janhvi Kapoor

    అసలు కంగనా రనౌత్ లో మునపటి పట్టు లెదని ఆమె యాంటీ ఫ్యాన్స్ ఆమె పై విరుచుకుపడుతున్నారు. పైగా కంగనా రనౌత్ లాంటి ముదిరిపోయిన నెగిటివ్ హీరోయిన్ కంటే, అసలు సిసలు గ్లామర్ బ్యూటీ అయినా జాన్వీ కపూర్ ను సీత పాత్ర కోసం తీసుకోండి అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు నెటిజన్స్. మరి మేకర్స్ నెటిజన్ల సలహాను ఫాలో అవుతారా లేదా అనేది చూడాలి.

    కానీ, మార్కెట్ పరంగా చూసుకుంటే.. జాన్వీ కపూర్ కంటే కూడా, కంగనా రనౌతే బెటర్ ఆప్షన్. కాకపోతే జాన్వీ కపూర్ అయితే.. ఫ్రెష్ గా ఉంటుంది. పైగా జాన్వీ కపూర్ పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ లేదు. అందుకే.. ఆమె కూడా బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. మరి చూడాలి మేకర్స్ జాన్వీతో ముందుకు పోతారో లేదో.

    Also Read:Prabhas Food: ప్రభాస్ ప‌ర్ఫెక్ట్‌ గా వండే ఫుడ్ ఇదే, ఎక్కడ వండుతాడో తెలుసా ?

    Tags