https://oktelugu.com/

షర్మిలను టార్గెట్ చేసేది ఆ ఒక్క సమస్యే?

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనేది సామెత. ప్రస్తుతం వైఎస్ షర్మిల వ్యవహారంలో ఇది కరెక్టే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తన అన్న తెలంగాణలో చెల్లెలు రాజకీయాలు చేసేందుకు నిర్ణయించుకున్నారా? లేక ఎవరి నిర్ణయాలు వారివేనా అనే విధంగా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలోని సమస్యలపై షర్మిల సంధిస్తున్న ప్రశ్నలకు తన అన్ననే సమాధానం చెప్పాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆమె పార్టీ మనుగడపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ జగన్ తన పార్టీని తెలంగాణలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 27, 2021 10:37 am
    Follow us on

    Sharmilaఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనేది సామెత. ప్రస్తుతం వైఎస్ షర్మిల వ్యవహారంలో ఇది కరెక్టే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తన అన్న తెలంగాణలో చెల్లెలు రాజకీయాలు చేసేందుకు నిర్ణయించుకున్నారా? లేక ఎవరి నిర్ణయాలు వారివేనా అనే విధంగా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలోని సమస్యలపై షర్మిల సంధిస్తున్న ప్రశ్నలకు తన అన్ననే సమాధానం చెప్పాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆమె పార్టీ మనుగడపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

    వైఎస్ జగన్ తన పార్టీని తెలంగాణలో మూసేసిన నేపథ్యంలో చెల్లెలు షర్మిల పార్టీ పెట్టడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయారనే తెలుస్తోంది. అయినా తన పంతం వీడకుండా పార్టీ పెట్టి ఇప్పుడు అబాసుపాలవుతున్నారు. సోదరి షర్మిల లేవనెత్తే ప్రతి ప్రశ్న జగన్ కే సూటిగా గుచ్చుకుంటోంది. దీంతో ఆయన కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం తన చెల్లెలే అని తెలిసినా జగన్ మాత్రం ఏం చేయకుండా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది.

    తెలంగాణలో నిరుద్యోగ సమస్య రూపుమాపాలని పదేపదే చెబుతున్న షర్మిలకు వింత పరిస్థితి ఎదురవుతోంది. ముందు ఏపీలో ఉన్న నిరుద్యోగాన్ని పారదోలాలని కౌంటర్ వస్తోంది. దీంతో ఏం మాట్లాడితే ఎటు పోతుందో అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి మంగళవారం నిరుద్యోగుల వారంగా ప్రకటించి పోరాటం చేసేందుకు సిద్ధమైనా అధికార పక్షం నుంచి ఎదురు దాడి జరుగుతోంది. దీంతో ఆమె మనుగడ ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉండగా జగన్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో కనీసం పది వేల ఉద్యోగాల భర్తీకే ప్రకటన వెలువడడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో యాభై వేల ఉద్యోగాల కల్పనకు కసరత్తు మొదలైంది. దీంతో ఏపీలో ఉద్యోగాల భర్తీకి అన్నను డిమాండ్ చేయాలనే విషయం సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతోంది. నదీజలాల వినియోగంలో కూడా షర్మిల డిమాండ్లు అన్న ముందు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.